వైఎస్ ఉండగానే చంద్రబాబును కలుస్తానన్నాడు రాహుల్ ! 11 ఏళ్ల తర్వాత ఓకే చేశాడు టీడీపీ అధినేత !

చంద్రబాబు ఎందుకు కలుస్తున్నాడు రాహుల్ గాంధీని ? ఢిల్లీలో చక్రం తిప్పేందుకా ? రాజకీయ లాభం కోసమా ? దేశం మొత్తంమ్మీదా పెత్తనం కోసమా ? రాజకీయమే ముఖ్యం అనుకుంటే చంద్రబాబు అప్పుడే కలిసేవాడు. రాహుల్ గాంధీ కలుస్తానని కబురు పెట్టినప్పుడు బాబు కనీసం ముఖ్యమంత్రిగా కూడా లేడు. ఈ సంగతి చాలా కొద్ది మందికి తెలుసు !

రాహుల్ గాంధీ అదో రకం. రాజకీయాల కన్నా ఫీలింగ్ ముఖ్యం అనుకునే బాపతు. పద్ధతిగా ఉండాలి. పదవులు అవ్వే దగ్గరకి వస్తాయ్ అంటాడు. బహుశా తాతల నాటి నుంచి చూసిన అధికారం తలకెక్కపోవడం వల్ల కావొచ్చు. మోడీలా మిడిసిపాటు ఉండదు. అందుకే చంద్రబాబు విపక్షంలో ఉండగా ఊహించని సంగతి ఎదురు వచ్చింది. 2007లో ఓ సారి రాహుల్ హైద్రాబాద్ వచ్చాడు. బిజీ బిజీగా ఉన్నాడు. ఓ రోడ్ షోలో పాల్గొన్నాడు. అప్పటికి దగ్గర పడ్డాయ్ గ్రేటర్ ఎన్నికలు. మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రబాబు వల్లే హైద్రాబాద్ డెవలప్ అయ్యింది. ఆయన ప్రభావమే ఇదంతా అన్నాడు. పక్కనున్న వైఎస్ తో సహా అందరూ షాక్ అయ్యారు. అదేంటి సార్ టీడీపీ మన ప్రత్యర్థి అలా అనేశారు అని అన్నారు కొందరు సీనియర్లు. నిజమే కదా అన్నాడు నవ్వేస్తూ !

బహుశా వైఎస్ లాంటోణ్ని దగ్గరగా చూడ్డం వల్ల కావొచ్చు. చంద్రబాబు గొప్పదనం ఏంటో తక్షణం తెలుసుకున్నాడు రాహుల్. కలుస్తానన్న కబురు వెనక రాజకీయం లేక పోవచ్చు. చంద్రబాబు ఆర్థిక విధానాలు అప్పటికే జేఎన్యూ ఢిల్లీలో పిల్లలకి పాఠాలయ్యాయ్. ఇంటర్నేషనల్ గుర్తింపు వచ్చేసింది. అందుకే అబ్బురపడ్డాడు రాహుల్. కలుస్తా అనడానికి అసలు కారణం అది. మా నాన్న తరహా ఆలోచనలు ఆయనకి ఉన్నాయ్ అని ఒకరిద్దరి దగ్గర అన్న గుర్తు. కానీ చంద్రబాబు కుదరదని తేల్చేశాడు. బాబుకి కుషనే కావాలనుకుంటే, అధికారానికి దగ్గరగా ఉండాలి అనుకుంటే అప్పుడే మీటింగ్ అయిపోయేదేమో. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ జీవితంలో వైఎస్ ఉండగా ఫేస్ చేసినంత ఒత్తిడి ఎప్పుడూ లేదు. అఫ్ కోర్స్ ఎదిరించి నిలిచాడన్నది వేరే సంగతి.

-->