20 నుంచి చంద్రబాబు జాతర ! టీడీపీలోకి ఎనిమిది మంది !

ఫస్ట్ బ్యాటింగ్ నీదే ! ఎంత కొట్టుకుంటావో కొట్టుకో ! ఆ తర్వాత ఛేజింగ్ దెబ్బకి చెదిరిపోతావ్. నా దెబ్బకి నలిగిపోతావ్ అన్నట్టుంది టీడీపీ వాయిస్ ఇప్పుడు ! వైసీపీ వరస బెట్టి టీడీపీ నాయకులకి కండువా కప్పుతుంటే, చంద్రబాబు వెయిట్ అండ్ సీ మోడ్ లో ఉన్నాడు. ఎందుకా అని ఆరా తీస్తే మన బ్యాటింగ్ 20 నుంచి మొదలవుతుంది బ్రదర్ అంటున్నారు. ఇంతకీ ఎవరెవరు ఉంటారు లిస్టులో ?

ఈ సమయంలో చేరికలు పెద్దగా పొడిచేది దెబ్బ తీసేది ఏమీ ఉండదు. అసెంబ్లీ టిక్కెట్టు కష్టం అని చెప్పేశాక అవంతి వెళ్లిపోతేనో, ఆల్రెడీ ఫిక్సయిన ఆమంచి సైకిల్ దిగితేనో పెద్దగా ఇబ్బంది లేదు. కేవలం లెక్కకే పనికొస్తాయ్. మరి ప్రభావం చూపే చేరికలు ఎలా ఉంటాయో 20 నుంచి చూడమంటోంది టీడీపీ. గుంటూరులో ఇద్దరు రెడ్డి నాయకుల రాకతో మొదలవుతుంది. ఆ తర్వాత వంగ వీటి రాథా సైకిల్ ఎక్కుతాడు. అటు పైన కోట్ల ఫ్యామిలీ చేరుతుంది. వాళ్లు అయ్యాక, ఉత్తరాంధ్ర వంతు. కొణతాల రామక్రిష్ణ రాక ఖాయం. ఆ వరసలోనే సబ్బం హరి కూడా ఉంటారు. వీళ్లతో పాటు నెల్లూరు నుంచి ఇద్దరు టీడీపీలోకి రాబోతున్నారు. ప్రకాశంలో ఈ మధ్య వైసీపీలో చేరిన మాజీ మంత్రి కూడా టీడీపీలోకి వస్తారని ప్రచారం గట్టిగా సాగుతోంది. నిజానికి నేను టీడీపీలోనే చేరాలి అనుకున్నాను. కానీ వాళ్లు అప్పట్లో తేల్చలేదు. అందుకే ఇటు వచ్చాను. ఇప్పుడు అక్కడ ఉంటేనే మంచిది అనే అభిప్రాయంతో నిర్ణయం మార్చుకున్నాను అని ఆయన చెప్పేశాడు సన్నిహితులకి ! ఇలా ఉండబోతోంది వరస.

టీడీపీ నేతల్ని చేర్చుకోవడంలో వైసీపీ ముందు నుంచి వర్కవుట్ చేసింది. అక్కడ టీఆర్ఎస్ తో కలిసి, ఇటు బీజేపీని కూడా లెక్కలోకి తీసుకొని జాగ్రత్తగా పావులు కదిపింది. ఇన్నాళ్లూ సాయిరెడ్డి ట్విట్టర్ ల మాత్రమే కనిపిస్తూ, బయటకి పొక్కకుండా ఆపరేషన్ టేకాఫ్ కి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఫినిషింగ్ టచ్ మాత్రం టీడీపీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ రకంగా ఫిబ్రవరి మాసం మొత్తం జంపింగుల కాలంగా ఉండబోతోంది ఏపీ రాజకీయాల్లో!

-->