సర్వే రిపోర్ట్ పేరుతో అల్లుడి యమ గిల్లుడు ! టీడీపీలో ఆ పెద్దాయనకి పిడి పడుతుందా ?

భరించడం చంద్రబాబు బలం. సమయం చూసి కత్తిరించడం కూడా చంద్రబాబుకున్న అడ్వాంటేజే ! టీడీపీ ఆయన పెద్దాయన పేట్ కి ఇలాగే కత్తి పడుతుందా ? ఇప్పటి వరకూ ఆయన చాలానే డామేజ్ చేశాడు. ఇప్పుడు ఆయన అల్లుడు కూడా సర్వే రిపోర్ట్ పేరుతో ఇష్టారీతిన పేలుతున్నాడు. సెలవు మీద వెళ్లాడు అంటున్నారు. మరి గాటు పడుతుందా ?

ఆయన టీడీపీలో బరువైన నాయకుడు. పదవులు అనుభవిస్తున్నాడు. అవకాశాలు తీసుకుంటున్నాడు. పెద్దగా స్పందించడు దేనికీ ! పట్టించుకోడు. ఎప్పుడో ఏదో చేశాడన్న ఉపకార కోణంలో ఇప్పటికీ మోస్తున్నాడు చంద్రబాబు అంటారు అందరూ. ఇప్పుడు ఆ నాయకుడితో ఒకటి కాదు రెండు కాంప్లికేషన్లు వచ్చాయ్. సరిహద్దు అవతల నుంచి దాడులు, కవ్వింపులు జరుగుతున్నా ఆయన స్పందించడం లేదు. కుల కోణంలో చూసినా, బంధుత్వం లెక్కగట్టినా అందరికంటే ముందు ఆయనే స్పందించాలి. ఎందుకంటే ఆయన మాట్లాడితే అవతల పక్క నుంచి వచ్చినోడు మూసుకుంటాడు. కానీ ఆ పని ఆయన చేయడం లేదు. ఎందుకంటే, నాకు ఎవడు చెబుతాడులే అనే ధీమా ! ఇక రెండోది ఆయన అల్లుడి గిల్లుడు. మెడికల్ ఇన్ ఫ్రాలో ఆయన ఓ ఉద్యోగి. భారీగానే పోగేశాడు. ఇప్పుడు ఆయన మీద ఎటాక్ జరుగుతుందేమో అని భయం. ఏసీబీ పట్టుకుంటుందని ఒణుకు. అందుకే లూజ్ టాక్ మొదలు పెట్టాడు. నేను సర్వే చేయించాను. టీడీపీ వెనకబడి ఉంది అని 8 తేడా ఉంది కష్టమే అని దారినపోయే వాళ్లని కూడా పిలిచి చెబుతున్నాడు. ఇక్కడే ఓ సంగతి చెప్పాలి. చంద్రబాబు తనను తిట్టినా పెద్దగా పట్టించుకోడు. కానీ పార్టీ అవకాశాలు, భవిష్యత్ మీద దెబ్బ కొడతా అంటే దృష్టి పెడతాడు. ఇది ప్రకృతి. మరి ఇప్పుడు ఆ పెద్దాయనను పిలిచి చెబుతాడా ?

చెబితేనే నయం. కాస్త బెటర్ గా ఉంటుంది. లేదు ఇలాగే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. అందరూ మాట్లాడుకోవడం కన్నా వేటు వేయడం నయం కదా అని టీడీపీ వాళ్లకే అనిపిస్తుంది. మరి ఇలాంటి బురద సాధ్యమైనంత త్వరగా కడితేనే బెటర్. చంద్రబాబు స్లో అండ్ స్టడీగా ఉంటాడో, సాధ్యమైనంత త్వరగా దృష్టి పెడతాడో చూడాలి !

-->