ఆ మహిళా నేత వైసీపీలో చేరాలి అనుకుంది ! ఆ నటుడు మీడియేషన్ చేశాడు ! తర్వాత ఏమైంది ?

భయం అనాలో, అమాయకత్వం అనాలో, మూర్ఖత్వం అనుకోవాలో, అదీ కాదంటే అధికారం లేకుండా ఒక్క పూట కూడా బతకలేని దౌర్భాగ్యంగా చూడాలో కానీ ఇదే టాక్ గట్టిగా నడుస్తోంది. ఆమె వైసీపీలో చేరాలి అనుకుందట ! సినీ నటుడు ఆమె తరపున మీడియేషన్ కూడా చేశాడు అంటున్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది ? అవునా అని తెలుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోయే న్యూస్ ఇది. ఆమె అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు ఉంది. వారసుడు భవిష్యత్ మీద ఆందోళన పడుతున్నట్టుగా ఉంది. ఆ విషయం అర్థం అవుతూనే ఉంది. ముందు నుంచి ఆమెకు అన్ని రకాలుగా నచ్చచెప్పినా పెద్దగా పట్టించుకోలేదు అంటారు.

తీరా ఓఢిపోయాక ఆ వేదనలో ఏం చేస్తోందో అర్థం కాని పరిస్థితి వచ్చిందని సన్నిహితులే వాపోతున్నారు. మీకేం తెలుసు నా బాధ అంటోంది అక్క, ఏం చెబుతాం అని నెత్తికొట్టుకుంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే ఆమె ఓ దశలో వైసీపీలో చేరేందుకు కూడా సిద్ధపడింది అంటున్నారు. ముందు నుంచి ఆమె కుటుంబానికి సన్నిహితంగా ఉండే నటుడు రంగంలోకి కూడా దిగాడు. మీడియేషన్ చేశాడు అంటున్నారు. ఇటు పార్టీపై పగ తీర్చుకోవడంతోపాటు అటు ఆమెకి సాయపడినట్టు ఉంటుంది అని అతని ఆలోచన కాబోలు. నేను పదవులు ఆశించి రాలేదు, కేవలం అభిమానంతో వైసీపీలో చేరాను అని ప్రకటనలు చేసే ఆ నటుడు చెప్పిన తర్వాత కూడా జగన్ వైపు నుంచి సానుకూల స్పందన రాలేదు అంటున్నారు. అందుకే ఇక అటు వైపు చూసి లాభం లేదు అని ఆమె నిర్ణయానికి వచ్చిందట. ఇప్పుడు బీజేపీ వైపు ప్రయత్నాలు సాగుతున్నాయ్ అంటున్నారు. కానీ అవకాశం ఉండకపోవచ్చు అక్కడ కూడా ! ఎందుకంటే ఈమెకు ప్రత్యర్థిగా ఉన్న అదే సామాజిక వర్గం ఎమ్మెల్యే అక్కడికి చేరుతున్నాడు. అంటే ఛాన్స్ రాకపోవచ్చునేమో అంటున్నారు.

అరెరె ఇన్నాళ్లూ ఘనంగా చెప్పుకున్నాం. మేం ఉన్నామని కాలర్ ఎరేశాం. తీరా చూస్తే పరిస్థితి ఇలా అవుతోంది ఏంటి, అసలు అటు వైపు చూడటం ఏంటి అని హార్డ్ కోర్ అభిమానులు కూడా ప్రశ్నించుకుంటున్నారు. నిజమేనా ? అని ఆరా తీస్తున్నారు. ఆరోపణ చేయాల్సిన అవసరం ఏముందప్పా, బాధనిపిస్తాంది అంటూ చెప్పుకుంటున్న తీరు చూస్తే రాజకీయం ఎంత వేగంగా పాతాళానికి పడుతోందా అనిపిస్తోంది.

-->