విశాఖలో ఆ ఎమ్మెల్యే సైడు మారడం ఖాయమా ? రేపేనా ముహూర్తం ?

రోజుకొకరుగా పేర్లు బయటకి చెబుతూ, ఎంజాయ్ చేయాలన్నది వైసీపీ వ్యూహం. విశాఖ వంతు వచ్చింది. ఆ ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉంటాడా ? జారిపోతాడా ? అదే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి వైసీపీ – టీఆర్ఎస్ బాగానే వర్కవుట్ చేశాయా ?

విశాఖ జిల్లాలో వైసీపీ విలవిల్లాడుతోంది నిజానికి ‍! సిటీలోనే కాదు చుట్టుపక్కల కూడా మెలకలు కూడా లేవు. సాయిరెడ్డి దృష్టి పెట్టిన తర్వాత పరిస్థితి బాగా మెరుగైంది. టీడీపీకి ! అలాంటి కండిషన్ లో ఇప్పుడు ఓ ఎమ్మెల్యేను టీడీపీని ఆకర్షించామని వైసీపీ చెబుతోంది. నిజమేనా ? యలమంచిలి చుట్టూ చుట్టూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయ్. జగన్ తో సమావేశం ఉంటుందని, ఆల్రెడీ అయిపోయిందని చెబుతున్నారు. మరి అసలు విషయం ఏంటి ? టిక్కెట్ కష్టం అని చెప్పారా ? లేదంటే పోటీ ఉంది ఈసారి కాస్త సర్దుకోవాలని అన్నారా ? సంకేతాలు ఏమైనా ఇచ్చారా అంటే ఇటు వైపు నుంచి సైలెన్సే సమాధానం అవుతోంది. అసలు విషయం ఏంటంటే, టీడీపీలో రిజర్వు ఫోర్సు ఎక్కువ అయిపోయింది. అలవికానంత మంది వచ్చి చేరిపోయారు. ఎందరు వచ్చినా మంచిదే అన్నట్టు చంద్రబాబు తెచ్చి దగ్గర పెట్టుకున్నారు. వైసీపీ పరిస్థితి అది కాదు. కనీ 40 నియోజక వర్గాల్లో కేండిడేట్ ఎవరు అంటే చెప్పే పరిస్థితి కూడా లేదు. ఆ లోటు భర్తీ కోసం ఇప్పుడు తాపత్రం కనిపిస్తోంది.ఇటు టీడీపీలో అడ్జెస్ట్ మెంట్స్ కష్టం అయిపోయే సరికి పొర్లిపోయే బ్యాచ్ పెరుగుతోంది. యల మంచిలి కూడా అదే జరిగితే ఇక అలాగే అనుకోవాలేమో ! మరో మాట లేదు ఇంకా !

చంద్రబాబు ఇప్పటి వరకూ నిజానికి ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదు పూర్తిగా ! అప్పటికప్పుడు పిలవడం, మాట్లాడ్డం ఉంటున్నాయ్ కానీ ప్రాంతాల వారీగా ప్రణాళికలో ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి అనేది ఖరారు కాలేదు. బలమైన చేరికలు ఉండే సరికి అలా ఉంచారని పార్టీ అంటోంది. మరి ఇకకైనా త్వరగా అటు వైపు చూస్తే బెటరేమో !

-->