చంద్రబాబుకి హోదా ఇచ్చాడు రాహుల్ ! ఆజాద్ షాక్ అయ్యాడు !

చంద్రబాబుపై రాహుల్ గాంధీ అభిప్రాయం ఏంటి ? కలిసే ముందు ఏమన్నాడు ? కలిసిన తర్వాత ఏమన్నాడు ? కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆజాద్ ఇంట్రెస్టింగ్ సంగతులు చెబుతున్నాడు ! గులాంనబీ ఆజాద్ ఢక్కామొక్కీలు తిన్న సీనియర్. ఇందిర హయాం నుంచి కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నాడు. సోనియా సమయంలో అయితే ఆజాద్ నంబర్ టాప్ త్రీలో ఉంది కొన్నాళ్లు ! రాహుల్ టీమ్ లో కూడా ఆయన కీలకమే. అలాంటి ఆజాద్ చంద్రబాబుతో రాహుల్ మీటింగ్ మీద ఓ ఇంట్రెస్టింగ్ సంగతి చెప్పాడు. అది విని కాంగ్రెస్ వాళ్లే ఆశ్చర్యపోతుంటే, రాజకీయ వర్గాల్లో చర్చ రేగుతోంది !

రాహుల్ గాంధీ ఈజీ గోయింగ్. పదవులు వస్తుంటాయి పోతుంటాయ్ అనే టైపు. పైపెచ్చు ఆర్భాటం హంగు ఉండదు. కొన్ని రోజులు టాస్క్ మీద ఉంటాం. పద్ధతిగా పనిచేస్తాం. జనం కోసం ఏమైనా చేయగల్గితే ఆలోచిస్తాం. కొన్నాళ్లు విశ్రాంతి కూడా కావాలని అనే టెండెన్సీ ఉన్న నాయకుడు. అందుకే 70 ఏళ్లు దాటిన వాళ్లని కూడా కేజువల్ గా పేరుతో పిలుస్తాడు. అలా పిలిచాడనే మధ్యప్రదేశ్ లో బీజేపీ గొడవ చేస్తోంది. అది వేరే సంగతి. అంత మోడ్రన్ గా ఉండే రాహుల్ గాంధీ చంద్రబాబు విషయంలో మాత్రం సెంటిమెంట్ ఫీలయ్యాడా ? అవుననే అంటున్నారు. మామూలుగా రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ ఇచ్చిన తర్వాత సరిగ్గా ఆ సమయానికే కలుస్తాడు. అలాంటిది చంద్రబాబు విషయంలో మాత్రం ఆరేడు నిమిషాల ముందే రెడీ అయ్యి, సిద్ధంగా ఉన్నాడు. ఆయన అలవాట్లు, టీ తాగుతారా లేదా లాంటివన్నీ కనుక్కున్నాడు. వచ్చారు అని తెలియగానే పైజామా సర్దుకుంటూ వాకిట్లోకి వచ్చి స్వాగతించారు. మాట్లాడారు. ఐయామ్ గ్లాడ్ అన్నారు. సర్ షైన్ లీడర్ అన్నారు. అడ్మైరింగ్ గా చూశాడు చర్చ జరుగుతున్నంత సేపూ ! నిజానికి చర్చ కూడా 45 నిమిషాలు మాత్రమే. కానీ చంద్రబాబుతో రాహుల్ దాదాపు గంటా 5 నిమిషాలు మాట్లాడాడు. అంతా అయ్యాక బాబుతో పాటు నడిచి వచ్చి జాయిండ్ ప్రెస్ కాన్ఫెన్స్ కూడా అటెండ్ చేశాడు. మాట్లాడుతున్నంత సేపూ చంద్రబాబును ఆసక్తిగా చూస్తూ, తల ఊపుతూ కనిపించాడు. హి ఈజ్ ఫాదర్లీ ఫిగర్ అన్నాడు. తండ్రి లాంటి ఫీలింగ్ వచ్చింది అనే మాట చెప్పాడు. అంత గౌరవం చూసి ఆజాద్ లాంటి వాళ్లు ఆశ్చర్యపోయారు.

ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది. చంద్రబాబు పరిస్థితుల్ని ఎంత కచ్చితంగా అంచనా వేస్తాడో అని ! కనీసం మర్యాద లేదు. మన్నన లేదు. అప్పాయింట్ మెంట్ అడిగితే టైమ్ కూడా ఇవ్వని మూర్ఖుడిని ఏపీ తిప్పికొట్టింది. ఇప్పుడు రాహుల్ ఏపీకి సాయం చేసేందుకు సిద్ధం అంటున్నారు హోదా ఇస్తా అంటున్నారు. రాష్ట్రానికే కాదు మన నాయకుడికీ అపూర్వమైన స్థానం, హోదా ఇచ్చాడని అర్థం అయ్యింది నిన్నటి ట్రీట్మింట్ తో !

-->