చంద్రబాబు ప్రధాని అవుతాడా ? అఖిలేష్ ఫోన్ వ్యూహమేంటి ?

ఢిల్లీ లెవెల్ రాజకీయంలో ఒకడంటే రెండో వాడికి పడదు. ఇద్దరి కలిస్తే మూడోవాడి మీద పడతారు. అలాంటిది అందరూ చంద్రబాబు వెనక నిలబడేందుకు ఎందుకు రెడీ అవుతున్నారు ? ఏపీకి అన్యాయం జరుగుతోంది, కేంద్రం రాజకీయం ఆడుతోంది, మోడీ రాష్ట్రాల్ని అణిచేస్తున్నాడు అంటూ ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు మొదలు పెట్టిన యుద్ధం ఆరంభంలోనే అదిరే రిజల్ట్ ఇస్తోంది. వారం తిరగక ముందే రెండోసారి ఢిల్లీ వెళుతున్నాడు చంద్రబాబు. ఏంటి ? ఏం జరగబోతోంది ? చంద్రబాబు ప్రధాని అవుతాడా ?

బావి కోసం తవ్వితే లంకె బిందెలు దొరికినట్టుంది చూడబోతే ! అఖిలేష్ ఫోన్ కాల్ చూస్తుంటే అలాగే ఉంది. ఏపీకి అన్యాయం చేశాడు మోడీ, ఇచ్చిన మాట తప్పాడు మేం యుద్ధం చేస్తున్నాం కలిసి రండి అని కేవలం ఫార్మల్ గా చెప్పేందుకు ఢిల్లీ వెళ్లాడు గత వారం. చంద్రబాబు లెక్క ఇదే. కానీ రెస్పాన్స్ మాత్రం బంపర్ గా ఉంది. ఆ టూర్లోనే కాంగ్రెస్ కి మాయావతి టెన్షన్ దాదాపుగా క్లియర్ చేసేశాడు. నాన్ బీజేపీ కూటమిలో కాంగ్రెస్ తో నడవాల్సిన అవసరం ఏంటో ఆమెకి అర్థ అయ్యేలా చెప్పాడు. అంటే ఓ 40 శాతం ప్రొబ్లమ్ క్లియర్ అయినట్టే. కూటమి కన్ఫామ్ అయినట్టే. బాబు చొరవతోనే ఇప్పుడు ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ కి మద్దతు ఇస్తామంటోంది సీపీఎం. అంటే లెఫ్ట్ కూడా వచ్చేస్తోంది. ఇప్పుడు అఖిలేశ్ కాల్ చేసి మరీ కోరాడు. మమ్మల్ని నడిపించండి అని. అంటే బాబు రావాలి – బాబు కావాలి అని ఢిల్లీ లెవెల్లో వస్తోంది పిలుపు, రెస్పాన్స్ కూడా !

ఇప్పటికే మమత కోరారు. కేజ్రీ ముందు నుంచి చెబుతున్నది అదే. పవార్ లాంటి వాళ్లు ఆల్రెడీ ఉన్నారు. స్టాలిన్ అండ్ కో కలిసి నడిచేందుకు సిద్ధం. మాయ ఓకే. ఇప్పుడు అఖిలేష్. ఫరూఖ్ లాంటి వాళ్లు ఎప్పుడూ సిద్ధమే. అంటే బీజేపీ వ్యతిరేక కూటమి కట్టడంలో చంద్రబాబు మూడొంతులు సక్సెస్ అయ్యాడు. మోడీ పతనం ఊహించిన సమయం కంటే ముందే జరగబోతున్నట్టు అనిపిస్తోంది. తెలంగాణ ఫలితం వచ్చాక, ఆ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ గెలిచాక ఇక ఖరారే. బీజేపీ పరారే !

-->