చంద్రబాబు లెవెల్ ఏంటో, కేసీఆర్ స్థాయి ఎంతో అఖిలేశ్ తేల్చేశాడు !

విమానం అద్దె దండగలాగే అనిపిస్తోంది. ఫ్యూయల్ ఖర్చు అయిపోతోంది కానీ ఫలితం మాత్రం ఉండటం లేదు. భవనేశ్వర్, కోల్ కతా టూర్ తర్వాత లక్నో వైబ్రేషన్స్ కూడా అలాగే ఉన్నాయ్. అందుకే కేసీఆర్ లబోదిబోమనే పరిస్థితి. చంద్రబాబుకీ కేసీఆర్ కి తేడా ఏంటో, ఎవరి లెవెల్ ఏంటో ఆ నలుగురూ చెప్పేశారు !

ఎంత పొర్లాడినా కొందరికి అంటుకోదు. ఇంకొందరికి మాత్రం వెంట వస్తూనే ఉంటుంది. ఏంటది ? కీర్తి ప్రతిష్టలు. అవును. జాతీయ రాజకీయాల్లో ఏదో చేయాలని, మోడీకి ఎలాగోలా లాభం చేయాలని కేసీఆర్ తెగ ప్రయత్నాలు చేస్తుంటే ఎవ్వరూ నోరు మెదపడం లేదు. మినిమం రెస్పాన్స్ కూడా రావడం లేదు. పైపెచ్చు, కేసీఆర్ కదిపిన వాళ్లంతా చంద్రబాబును అడుగుతున్నారు. మీతోనే ఉంటాం అని తేల్చి చెబుతున్నారు !

అవును. కేసీఆర్ ఒడిషా సీఎంని కలిశాడు. మన ఇద్దరం కలిసి పనిచేద్దామని చెప్పాడు. పట్నాయక్ కేసీఆర్ ముఖం మ్మీదే అన్నాడు – ఓ చిన్న ప్రాంతీయ పార్టీ ఢిల్లీని శాసించాలనుకోవడం కరెక్టు కాదేమో అని ! టీఆర్ఆర్ గురించి ! కాస్త బయటకి వచ్చి మీడియాతో మాట్లాడండి అని రిక్వెస్ట్ చేసినా కూడా అదే చెప్పాడు. అసలు ఇంకా ఏమీ అనుకోలేదని తేల్చేశాడు. కేసీఆర్ మాట్లాడినా లాభం లేదని తెలిసిపోయింది అక్కడే ! ఎంపీని పంపి మరీ మనసులో మాట చెప్పేశాడు నవీన్ పట్నాయక్. కేసీఆర్ చెప్పినట్టు, తనకి అసలు పోలవరాన్ని అడ్డుకునే ఉద్దేశం కానీ, చంద్రబాబుతో విరోధం పెట్టుకోవాలన్న ఆలోచన కానీ, కేసీఆర్ కూటమితో కలిసే ఉద్దేశం కానీ లేదని తేల్చేశాడు. అటు తర్వాత బెంగాల్ వెళ్లాడు కేసీఆర్. చేతులు కట్టుకొని, వంగి వంగి దండాలు పెట్టారు మమతకి ! ఆమె కూడా కనీసం మాట సాయం కూడా చేయలేదు. పై పెచ్చు అసలు నీ ఫ్రంట్ పాలసీ ఏంటని అడిగింది కేసీఆర్ ని ! అంటే రెండోది కూడా పాయె ! ఇక ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ వెళ్లి అఖిలేశ్ ని, మాయని కలుస్తా అంటున్నాడు. వాళ్లు కూడా బిక్కుబిక్కుమంటున్నారు. కలిస్తే ఎక్కడ బీజేపీ ముద్ర పడుతుందో అని వర్రీ అవుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ ఫ్రంట్ అంటూ ప్రత్యేక విమానంలో తిరుగుతున్నది మోడీ కోసమే అని ఢిల్లీ స్థాయిలో అందరికీ క్లారిటీ ఉంది. అందుకే ఎవ్వరూ కలిసి వచ్చే ఆలోచన కూడా చేయడం లేదు. పై పెచ్చు చంద్రబాబుతో టచ్ లో ఉండేందుకు, చంద్రబాబు కూటమిలోనే ఉండేందుకు సిద్ధం అని చెప్పేస్తున్నారు. అక్కడే పోయింది కేసీఆర్ గాలి. అందుకే అంటున్నది ఎవరి స్థాయి ఏంటో – కేసీఆర్ చంద్రబాబుల్లో ఎవరి లెవెల్ ఏంటో జాతీయ స్థాయి నేతలే తేల్చి చెబుతున్నారు. భవిష్యత్ చూపించబోయేది కూడా ఇదే !

-->