ఏకే బావ ఏకాకి అయిపోయాడు ! ఆమంచికి సూపర్ స్ట్రోక్ తగిలిందిగా !

అధికారులు గుప్పిట్లో ఉండాలి. పనులు అవుతూ ఉండాలి. రౌడీయిజం, బెదిరింపులు, దందాలు తెర వెనక సాగుతూ ఉండాలి. అవకాశం చూసి డీల్ మాట్లాడుకొని ఎన్నికల ముందు దెబ్బ కొట్టాలన్నది ఆమంచి ఫార్ములా ! అలాగే అనుకొని దూకేశాడు. లగాయించి దెబ్బ పడింది ఇప్పుడు ! బదిలో పడాల్సిన పోటు పడింది. ఏకే బావ ఇక లేడు. ఏకాకి అయిపోయాడు. ఎవరీ ఏకే బావ ?

ప్రకాశం జిల్లాలో ఆ జోడీ బాగా పాపులర్. జిల్లా మొత్తం కర్ర పెత్తనం చేసే ఆయన ఆమంచి జేబులో మనిషి అని చెబుతారు. ఆ ఆండతోనే ఆమంచి ముందు నుంచి టీడీపీలో ఉన్న వాళ్లపై కూడా పైచేయి సాధించాడు. పైపెచ్చు పెత్తనం చేశాడు. బహిరంగంగా తిట్టాడు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయ్. ఇప్పుడు ఆ వైర్ కట్ అయ్యింది.పోలీసు అధికారుల బదిలీల్లో భాగంగా కడప, ప్రకాశంలోనే భారీగా మార్పులు జరిగాయ్. ఆమంచికి అడ్డంగా కొమ్ముకాసిన ఆ అధికారి తొలగిపోయాడు. నేను వైసీపీ మనిషిని. మా మామ కోసం ట్రై చేస్తున్నా, తూర్పు గోదావరిలో టిక్కెట్ వస్తుంది. అప్పుడు చెబుతా మీ పని అంటూ టోపీ కింద రాజకీయం చేసిన మనిషి అతను. ఆమంచి ఏకే 47 లాంటి వాడు, పై పెచ్చు మావోడే అంటూ ఏకే బావ ఏకే బావ అంటూ తిరిగిన రోజులు నిన్న మొన్నటి వరకూ నడిచాయ్. ఇప్పుడు అన్నిటికీ చెక్ పెడుతూ బదిలీల్లో భాగంగా లెక్క సెట్ అయ్యింది. దీన్ని రాజకీయం అంటారేమో ! తప్పు తప్పు. మరి ఇదే రాజకీయం అయితే, నిన్నటి వరకూ ఆమంచి నడిపింది ఏమనుకోవాలి ? చంద్రబాబు చూస్తాడనో, కంట పడితే వదలడనో కాస్త నెమ్మదించి ఊరుకున్నాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విచ్చలవిడి అయిపోతోంది. గీత దాటేందుకు కూడా సిద్ధం అయిపోయారు ఇద్దరూ ! ఇలాంటి సమయంలో వాటంగాదిగింది బదిలీ బుల్లెట్.

ఇక ముందు ముందు కూడా ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు కాస్త కరుగ్గా ఉంటేనే నయం. అటు నుంచి బీజేపీ ఇటు వైసీపీ కూడా ఏకమై రాజకీయం నడుపుతున్నాయ్. పై పెచ్చు టీఆర్ఎస్ వేలు పెడుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఇక దూకుడు కంటిన్యూ కావాల్సిందే కదా ! మరో మార్గం లేదు.

-->