అందుకే వచ్చా ! తిరుమలలో జగన్ మోస్ట్ షాకింగ్ కామెంట్ !

విశ్వాసం ఉన్నోడు వివాదం చేసుకోడు. రగడ చేయాలనుకున్నప్పుడు, రాజకీయం కోసమే వెళ్లినప్పుడు భక్తి కోసం ప్రచారం ఉండకూడదు. జగన్ మాత్రం ఈ రెండింటిలో ఏదీ ఫాలో కాలేదు. పైగా నేరుగా చెప్పేశాడు. అందుకే వచ్చా అంటూ ఆయన చెప్పిన మాట షాక్ ఇస్తోంది. ఇంతకీ అందుకే అంటే – ఎందుకు ?

జగన్ మళ్లీ తిరుమల వెళ్లాడు. ఈ మధ్య మఠాలకి వెళుతున్నాడు .హిందువును అని చెప్పేందుకు లుక్ ఇస్తున్నాడు కదా అందుకే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే, తిరుమల మీద విశ్వాసం ఉంది నాకు అని చెప్పలేదు ఎప్పటిలాగే ! పైగా రాజకీయ మీటింగులు పెట్టాడు. రమణ దీక్షితులు లాంటి వాళ్లతో సమావేశం అయ్యాడు. నేను వచ్చాక మీకు మిరాశీ మళ్లీ తెస్తా అంటూ ఏదేదో చెప్పాడు. అటు తర్వాత శారదా పీఠంలో మకాం చేశాడు. అక్కడ కూడా రాజకీయాలు, ప్రస్తావనలు వచ్చాయ్. అన్నిటికీ మించి జగన్ బృందం ఎప్పటిలాగే నిబంధనలు తుంగలో తొక్కి తిరుమల కొండ మీద గంతులు వేసింది. కనీసం టోకన్లు కూడా లేకుండా, క్యూలైన్లు పాటించకుండా తోసుకొని పోయారు జగన్ తోపాటు వచ్చిన వాళ్లంతా ! అంటే విశ్వాసం ఉంటే, వినయ విధేయతలతో కదా ఉండాలి అని అక్కడ వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇంకో పక్కన టీవీ ఛానెళ్లలోనేమో ఒకటే హడావుడి. సామాన్య భక్తుడి తరహాలో జగన్ దర్శనం చేసుకున్నాడు అని ఊదర గొట్టేశారు. ఇదంతా అయ్యాక సన్నిహితులతో జగన్ ఓ మాట చెప్పాడు. తాను తిరుమల ఎందుకు వస్తాడో క్లియర్ గా క్లారిటీతో చెప్పేశాడు. అది విని అక్కడ వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఇదో రకంగా షాకింగ్ గా అనిపిస్తోంది. నమ్మకం కోసమో భక్తి కోసమో కాదన్నమాట. జగన్ తిరుమల వచ్చేది ఇందుకన్నమాట అనిపిస్తోంది.

ఇంతకీ ఎందుకు ? నాకు సెంటిమెంట్ ఎక్కువ. నాన్న లాగే సీఎం కావాలనుకుంటున్నాను. ఆయన కూడా తిరుమల వచ్చేవారు. అందుకే వచ్చాను తప్పితే అంతకు మించిన కారణం లేదు. నేను రాకూడదని ఎప్పుడూ అనుకోలేదు. వచ్చి దండం పెట్టాలని కూడా భావించడం లేదు అనేశాడు. అంటే జగన్ ఏం చేసినా కేవలం రాజకీయ లెక్కలతోనే చేస్తాడన్న మాట. మరోసారి రుజువు అయ్యింది

-->