టీడీపీ నుంచి వైసీపీలోకి మరో ఎంపీ జంప్ ! రవీంద్ర కాదు ఆయనే !

టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలు జంప్ చేస్తున్నారు. ఒకరు అవంతి, రెండు ఆయనే ! ఆయన అనగానే ముందు నుంచి పందుల రవీంద్ర వైపు పడింది చూపు. అమలాపురంలో హర్షకుమార్ సిద్ధంగా ఉండే సరికి ఆయనే అనుకున్నారు కానీ కాదు. ఇప్పుడు కోడి పందెం ఆడినంత సింపుల్ ఆయన ప్లేటు మార్చబోతున్నాడు అని పార్టీలో టాక్ నడుస్తోంది. సో రెండో ఎంపీ కూడా ఫిక్స్ !

రెండో ఎంపీ ఎవరో తేలిపోయింది. జగన్ పార్టీ ఓ ఈక్వేషన్ ప్రకారం వర్కవుట్ చేసింది. కాపులు టీడీపీకి ఓటు వేయరు. పవన్ సపోర్టు చేసినా కూడా లాభం లేదు అంటూ కొన్ని నెలలుగా స్కెచ్ వేసింది. టచ్ లోకి వచ్చింది. ఆల్రెడీ ఎంపీలుగా కాదు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ఆశ పడుతున్న వాళ్లకీ, కొత్తగా మళ్లీ గెలిచే అవకాశం లేదు. పై పెచ్చు ఆల్టర్ నేటివ్ వచ్చేశారు మాకు అని భయపడుతున్న టీడీపీ వాళ్లని వల వేసి పట్టి ఉంచింది. సమయం చూసి గుంజుతోంది. ఇదంతా కొన్ని వారాలుగా నడుస్తున్న గేమ్ ప్లాన్. ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఇప్పటి మేటర్ ఏంటో చూద్దాం. అవంతి తర్వాత మరో ఎంపీ సిద్ధంగా ఉన్నారు అని చెబుతున్నారు. కోడి పందేలు పేరు చెబితే గుర్తొచ్చేది ఆయనే. తెలంగాణ ఆంధ్రా లీడర్లకి ప్రత్యేక ఆహ్వానాలు పంపి మరీ ఆయన ఆడిస్తాడు. ఇప్పుడు పార్టీ కూడా అంతే ఊపుగా మారుస్తున్నాడు అంటున్నారు.

ఆయనకి గెలుపు మీద ఆశల్లేవట. అసెంబ్లీ కావాలట. కానీ చంద్రబాబు మాత్రం ఎంపీలు ఎంపీలుగానే వెళ్లాలి. పార్టీ వ్యూహాలను బట్టీ మాత్రమే టిక్కెట్లలో మార్పులు ఉంటాయని తెగేసి చెప్పాడు. పై పెచ్చు ఎంపీలతో తీర్మానం కూడా చేయించాడు అవంతి లాంటి వాళ్లని మా నాయకుడుగా పెట్టండి అని. అందుకే ఇప్పుడు కాస్త అటూ ఇటుగా ఉన్న వాళ్లు జారిపోతున్నారు. ఎక్కువ టైమ్ లేదు. ఒకట్రెండు రోజుల్లో ఆయన బయటపడతాడు. చూస్తుండండి.

-->