ఏపీ ఏం చూసి ఓటేస్తుంది ? జగన్ ఆల్రెడీ ఓడిపోయాడా ?

ప్రూవెన్ ఫ్యాక్ట్ వర్సెస్ మిత్. నిరూపితమైన నిజం వర్సెస్ అబద్ధం. చంద్రబాబు వర్సెస్ జగన్. ఎందుకంటే, చంద్రబాబు ఏం చేయగలడో ఈ ఐదేళ్లూ చెప్పడం కాదు. పోలవరం చూసి తెలుసుకోవడం అంతకన్నా కాదు. అమరావతి ఇప్పుడు ఎదురొచ్చి చెప్పాల్సిన పని కూడా లేదు. కియా లాంటి సంస్థలు, ఏపీకి వచ్చిన ఇండస్ట్రీలూ వత్తాసు పలకనక్కర్లేదు. తొమ్మిదేళ్ల పాలన చూపించింది. సైబరాబాద్ ని ఆవిష్కరించి, హైద్రాబాద్ ని తీర్చిదిద్దిన తీరే చెప్పింది చంద్రబాబు నాయకుడు, సమర్థుడు అని. అందుకే 2014లో ఏపీ ఓటేసింది. ఇప్పుడు రిపీట్ అంటోంది.

జగన్ ఏ బేసిస్ మీద నాయకుడు ? వైఎస్ కొడుకు అయినంత మాత్రాన నాయకుడు అవుతాడా ? రాజకీయాల్లో ఏమైనా సాధించాడా ? ప్రత్యేకంగా గుర్తిండిపోయే మైలురాళ్లు ఏమైనా ఉన్నాయా ? ఇదీ నా ప్రభావం అని చెప్పేందుకు ఏమైనా ఉందా తొలి పదేళ్లలో ? ఇదీ జగన్ సమర్థత అని తూచేందుకు, కొలిచేందుకు, లెక్క గట్టేందుకు రిజల్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా సాధించాడా ? ఉంటే చూపించండి డిస్కస్ చేద్దాం ! ఇది కేవలం రాజకీయ వాగ్వాదం కాదు. పొలిటికల్ ఆర్గ్యుమెంట్ మాత్రమే కాదు. ఏపీ భవిష్యత్ ని నిర్ణయించే ఈక్వేషన్. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి కుర్చీ పూలరథం కాదు. ఎవరైనా ఎక్కి ఊరేగడానికి ! ఓ ముళ్ల కిరీటం. బాధ్యత. ఆరుకోట్ల మంది భవిష్యత్. ఆఫ్టర్ ఆల్ మన కారుకి డ్రైవర్ గా పెట్టుకునేందుకే ఒరిజినల్ లైసెన్స్ చూపించమంటాం. కాండక్ట్ ఆరా తీస్తాం. తెలిసినోళ్లతో చెప్పించమంటాం. మనం వెనక కూర్చుంటే ముందు నడిపేవాడి విషయంలోనే అంత జాగ్రత్త పడితే, మరి జాతిని ముందుకు నడిపించాల్సిన వాడి విషయంలో ఇంకెంత ఉండాలి ?

అందుకే ఇప్పుడు చేరికలు పాయింట్ కాదు. పథకాలు కూడా పెద్ద విషయం కాదు. తిట్టుకోడాలూ, కులాలూ కూడా చివరి నిమిషంలో కౌంట్ కావు. ఏపీలో లెక్కకొచ్చేది, అక్కరకొచ్చేదీ ఒక్కటే దూరదృష్టి, సమర్థత, నాయకత్వం. ఆ మూడింటి విషయంలోచంద్రబాబుతో ఇటు జగన్ అయినా, అటు పవన్ అయినా పోటీ పడగలరా ? జెండాలు పట్టుకున్నోళ్లు కాదు. న్యూట్రల్ ఉన్నోళ్లని అడగండి. మొండిమొలతో తిరిగే బొడ్డూడని బుడ్డోడు కూడా చెబుతాడు. బాబే మొనగాడు అని ! నాయకత్వం అంటే ఆ నమ్మకమే !

-->