ఈ లిస్టులో వాళ్లు పోతే టీడీపీకి కాదు ఏపీకే మంచిది ! హైద్రాబాద్ తో సంబంధాలు తెగుతాయ్ !

పేరుకి ఏపీ ఎంపీలు. పిల్లల పెళ్లి మాత్రం హైద్రాబాద్ లో చేసినట్టే ఉంటుంది మన లీడర్ల యవ్వారం. వ్యాపారాలు వ్యవహారాలూ అక్కడ పెట్టుకుంటారు. జుట్టు కేసీఆర్ కుటుంబం చేతిలో పెట్టి ఇక్కడ రాజకీయాలు కావాలంటారు. ఇప్పుడు టైమ్ చూసి ఆ చుట్టు పట్టుకొని గుంజుతోంది టీఆర్ఎస్. అవంతి లాగే పారిపోతున్నారు మరికొంత మంది లీడర్లు ! ఇప్పుడు మారుతున్న వాళ్లంతా హైద్రాబాద్ లో వ్యాపారాలున్న బాపతే ! ఈ వలసలతో ఏపీ రాజకీయ ప్రక్షాళన అవుతుందా ?

ప్రశ్న ఎందుకు ? సందేహం లేదు. అవుతుంది. ఎందుకంటే హైద్రాబాద్ లో వ్యాపారాలు, ఆర్థిక ప్రయోజనాలు, లావాదేవీలు ఉన్న వాళ్లు ఎవ్వరినీ టీఆర్ఎస్ వదలడం లేదు. లిస్టు దగ్గర పెట్టుకొని మరీ టార్గెట్ చేస్తోంది. వైసీపీలో చేరతావా ? లేదంటే నీ ఫ్యాక్టరీ సంగతి చూడాలా ? నీ కాలేజీలపై కన్నేయాలా ? అన్నట్టు ఉంది వాళ్ల యవ్వారం. అందుకే అవంతి లాంటి వాళ్లు దూకేస్తున్నారు. ఇక మరికొందరు కూడా ఇదే వరసలో ఉన్నారు. ఇలాంటి వాళ్లంతా పార్టీ మారితే మనకే మంచిది. ఎందుకంటే గెలిచే పార్టీని కూడా కాదని, వదులుకొని వెళ్లిపోతున్నారు అంటే, వాళ్ల ఆర్థిక మూలాలన్నీ హైద్రాబాద్ లోనే ఉన్నాయ్. వాళ్లకి ఏపీ కన్నా హైద్రాబాదే ముఖ్యం. ఇలాంటి వాళ్లు ఏపీ కోసం ఏం పాటుపడతారు. ఇన్నాళ్లూ టీడీపీలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు. ఇప్పుడు మారిపోతున్నారు వాళ్లు. కాబట్టే అంటున్నారు అంటారేమో ! కాదు. ఇలాంటి వాళ్లని తప్పించాలని ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు ఆలోచనాపరులు. చంద్రబాబు కాస్త మెత్తగా ఉన్నాడు. ఇప్పుడు రాజకీయం తిరిగింది. వాళ్లు పోతున్నారు. వైసీపీ గెలవదు. వాళ్లు కూడా గెలిచే పరిస్థితి ఉండదు. అందుకే ఇక ఏపీ రాజకీయంలో కొత్త రక్తం వస్తుంది. ఏపీ ప్రయోజనాల కోసం పాటుపడే వాళ్లే వస్తారు. తిరుగు లేదు. హైద్రాబాద్ తో సంబంధాలు తెగితేనే ఏపీ రాకెట్ స్పీడు అందుకుంటుంది. రాజకీయాలు కూడా బాగు పడతాయ్.

ఈ రకంగా చూస్తే ఏపీలో జరుగుతున్న వలసలు మంచివనే చెప్పాలి. ఎందుకంటే హైద్రాబాద్ తో సంబంధాలున్న వాళ్లపైన టీఆర్ఎస్ ఒత్తిడి తెస్తోంది. వ్యాపారాలు ఉన్నవాళ్లని అయితే బెదిరిస్తోంది. ఎదిరించలేక వాళ్లు పార్టీ మారిపోతున్నారు. పోనీవండి. మారినోళ్లు గెలిచి వచ్చేది ఎంత మంది ? కనీసం 10 % మంది కూడా రారు చూస్తుండండి. అందుకే మంచిదే ! వలసలు మంచివే ! హైద్రాబాద్ తో లింకు తెగిపోవడం కూడా మంచిదే !

-->