ఏపీలో ఎంఐఎం పోటీ వైసీపీతో పొత్తు కన్ఫామ్ !

హీరోయిజం చూపించేందుకు ఒకడు షర్టు బటన్ విప్పాడే అనుకోండి, అంతకు మించి ఏదో చేయాలని ప్యాంటు జిప్ విప్పుకుంటామా ? వైసీపీ ఎత్తుగడ చూస్తే ఇలాగే ఉంది ! ఎవడో తెలంగాణ నుంచి పనీపాటా లేనోడు ఏపీలో వేలు పెడతా అని వస్తుంటే – భలే భలే అంటూ ఎగిరి గంతేసి పొత్తు పెట్టుకుంటోంది వైసీపీ. ఇదేం రూమర్ కాదు. ఖాయం !

అవును. ఎంఐఎం ఏపీలో పోటీ చేస్తోంది. ఖాయం అయిపోయింది. ఖరారుగా తేలిపోయింది. వైసీపీతో పొత్తు కూడా ఉంది. కర్నూలు జిల్లాలో వైసీపీ గురి పెడుతోంది. ముస్లింలు ఎక్కువగా ఉండటం, అక్కడ ఆల్రెడీ జగన్ తీవ్రంగా దెబ్బతిని పోయి ఉండటం లాంటివన్నీ లెక్కలో వేసుకొని పొత్తు పెట్టుకుంటోంది. ఇదే విషయం జగన్ పార్టీ లీడర్లకి చెప్పేశాడు. అక్కడ మీకు టిక్కెట్లు ఇవ్వడం కుదరదు. మీరు ఇక ఆశలు వదులు కోవచ్చు. అని తేల్చేశాడు. ఎంఐఎం వస్తోంది అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు క్లారిటీ వస్తున్నాయ్. ఎంఐఎం కర్నూలు, గుంటూరు లాంటి జిల్లాల్లో అభ్యర్థుల్ని పెడుతోంది. కేసీఆర్ ఇలాంటి వాళ్ల ద్వారా ఆపరేట్ చేయాలి అనుకుంటున్నాడు. వాళ్లకి జగన్ దారులు తెరిచి, దారులు పరిచి సహకరించాలి అనుకుంటున్నాడు.వైసీపీ సొంతంగా ఏం చేయలేదు కాబట్టి ఇలాంటి వాళ్లతో కలిస్తే కాస్తో కూస్తో మొగ్గు వస్తుందని భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది చూడబోతే ! కాకపోతే తెలుసుకోవాల్సిన పాయింట్ ఒకటుంది. తెలంగాణ నుంచి వచ్చి ఏపీలో వేలు పెడతా అంటే భగ్గుమంటారు జనం. అలాంటిది ఆ పార్టీలతో జగన్ నేరుగా పొత్తు పెట్టుకోవడం అంటే ఏంటి ? కేసీఆర్ ఆడమన్నట్టల్లా జగన్ ఆడుతున్నాడు అనే కదా అర్థం. అదే కన్ఫామ్ అవుతోంది. అందుకే ఎంఐఎం రాకతో టీడీపీ హ్యాపీ ఇప్పుడు.

త్వరలో అధికారిక ప్రకటన ఉండొచ్చు అంటున్నారు. పొత్తులు సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నట్టు చెబుతున్నారు. వంద సీట్లు ప్రకటిస్తా అంటూ గంతులేసిన జగన్ ఎందుకు వెనక్కి తగ్గాడు అంటే కూడా కారణం ఇదే అని అర్థం అవుతోంది. సర్దుబాట్లు అయ్యాక తీరిగ్గా చెబుతాడట. ఇంకేం, పండగ చేస్కోచ్చు !

-->