కేసీఆర్ పతనం ఎలా ఉంటుందో అప్పుడే చెప్పారు అన్నగారు ! ఇది వెంటాడే చరిత్ర !

ఐదుగురి చుట్టూ తిరిగే రాజకీయ చక్రం ఇది. తొలి దెబ్బ ఎవరు అయితే కొడతారో మిగతా నలుగురినీ వాడే జయిస్తాడు. గెలుస్తాడు అనేది స్క్రీన్ ప్లే లాక్. మహా భారతంలోజరిగిన గాధ ఇప్పుడు చంద్రబాబు మోడీ కేసీఆర్ లాంటి వాళ్ల చుట్టూ మళ్లీ రిపీట్ అవుతోంది. ఎలాగో తెలుసా !

భీముడు, బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు. ఈ ఐదుగురూ ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్లు. వీళ్ల జాతకం ప్రకారం వీళ్లలో ఎవరు రెండో వాడిని ముందు సంహరిస్తాడో, మిగతా ముగ్గిరిని కూడా వాడే గెలుస్తాడు. సంహరిస్తాడు. పంచ భీమ ప్రహసనం అంటాడు దీన్ని. అనుకోకుండా బకాసురిడితో పడుతుంది భీముడికి. గెలుస్తాడు. తర్వాత జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడి వరస. పెద్దో చిన్నో మన చుట్టూ కూడా ఇలాంటి పాత్రలు ఉన్నాయ్. అనుకోకుండా యుద్ధంలో తలపడి బకాసురుణ్ని ఓడించినట్టు ఇక్కడ కూడా కేసీఆర్ తో చంద్రబాబు తలపడాల్సి వచ్చింది. కలిసి నడుద్దామని కబురు పంపితే కాదన్నందుకు, ఎదురు తిట్టిపోసి, విషం కక్కినందుకు ప్రతిఫలం ఇది. తర్వాత జరాసంధుడు. కుల బలాన్ని మాత్రమే నమ్ముకొని పిల్లకత్తులతో జిత్తులు వేయాలనుకునే వాడు జరాసంధుడు అనుకుందాం. వాడి బలం కులంలో ఉంది. అందుకే కాళ్లు కుడి ఎడమలుగా పడేసి ఓడిస్తాడు భీముడు. ఇక్కడా అంతే వాడి బలం కమలంలో ఉందని చూపించి కొట్టేస్తాడు దెబ్బ. చంద్రబాబు. ఇక కీచకుడు. చెప్పుకుంటే సిగ్గు చేటు. కోక వాసన తగిలితే నేను ఇంతే, ఏం చేస్తాం – అని ఓపెన్ గా ప్రకటించుకున్నోడు కీచకుడు. ఇప్పటి వాడి సైజుకి ఇలాంటి పాత్ర ఎక్కువే అయినా వాడు చేస్తున్న డామేజ్ ని లెక్కకడితే సరిపోతుంది బ్యాలెన్స్. అందుకే వీణ్ని కూడా నొక్కి మట్టుపెట్టేస్తాడు భీముడు. ఇక దుర్యోధనుడు. రాజ్య కాంక్షతో అరాచకం చేసి అంతం అయినవాడు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. ఆఖరి అంకం అదే. 2019.

ఇప్పుడు రాజకీయాల్ని బట్టీ చూస్తే బలంలో భీముడు చంద్రబాబే. ఎందుకంటే ప్రజాబలాన్ని బట్టీ చూసినా, ప్రభావాన్నీ, యాక్సెప్టెన్సీనీ అంచనా కట్టినా చంద్రబాబే అందరికన్నా బల వంతుడు. అనుమానం లేదు. అందుకే పక్క రాష్ట్రంలో ఎన్నికలు కూడా చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయ్. ఢిల్లీలో మోడీ కూడా చంద్రబాబు మాట వినబడితే ఉలిక్కిపడి చూస్తున్నాడు. అందుకే, తెలంగాణలో మొదలయ్యే రణం – దుర్యోధనడు అంటే దామోదర దాస్ మోడీ పతనంతో రుణం తీర్చేస్తుంది. రాసి పెట్టుకోండి. అక్కడంటే యుద్ధం కాబట్టి సంహారం ఉంది. ఇక్కడ రాజకీయ సమరం కాబట్టి ఓడించడం, మట్టుపెట్టడం మాత్రమే ఉంటాయ్. కావాలంటే ఓ నెల రోజుల తర్వాత తిప్పి చూసుకోండి.

-->