అవంతిని లాగేసింది ఆయనే ! పొలిట్ బ్యూరో చెప్పాడు చంద్రబాబు !

ఓడిపోయిన పుంజు ఒడ్డూ పొడుగు ఎంత ఉంటే మాత్రం ఏం లాభం అంటారేమో ! పాయింట్ అది కాదు. ఆపరేషన్ ఎలా జరిగిందో అర్థం అయితే పరేషాన్ సగం తగ్గుతుంది. బహుశా అందుకే చంద్రబాబు క్షుణ్ణంగా చెప్పాడు పొలిట్ బ్యూరోలో !

ఇంతకీ ఏం చెప్పాడు చంద్రబాబు ? అవంతి హైద్రాబాద్ లో కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాడు. ఆల్రెడీ కాలేజీలు, ఇంజినీరింగ్ అఢ్మిషన్లు, కోచింగ్ సెంటర్లు లాంటివి ఆల్రెడీ ఉన్నాయ్. కొత్త డిస్టిలరీస్ మొదలు పెట్టాడు. బాల్ నగర్ ఏరియాలో ! బంధువులతోపాటు తోట త్రిమూర్తులు కూడా అందులో సన్నిహితంగా ఉన్నాడు. ఆ విషయం అందరితోపాటు టీఆర్ఎస్ కి కూడా తెలుసు. కేటీఆర్ పిలిచి మాట్లాడాడు. అన్నా మీకు ఏం కావాలన్నా చేస్తాం. మీకు ఉండగా ఉంటాం. తోడుగా నిలుస్తాం. కాకపోతే మీరు మాకు చిన్న పని చేసి పెట్టండి అనేశాడు. అదేం లేదు. కేవలం వైసీపీలో చేరడమే అని సింపుల్ గా చెప్పాడు. చెప్పి రెండు నెలలు అయ్యింది. నానీనానీ ఇప్పటికి తెలిసింది విషయం. బయట ప్రపంచానికి. చంద్రబాబుకి అప్పటికే ఇన్ఫో ఉంది. మన దగ్గర ఏమైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా అందరికీ స్వేచ్ఛ అవకాశాలు ఉన్నాయ్. మీరు కూడా అందరికీ చెప్పండి అని అవంతిని ప్రత్యేకంగా పిలిచి చెప్పాడు కూడా. కాకపోతే ఆయన కోరిన భీమిలి సీటు మాత్రం ఇవ్వలేకపోతున్నా అనేశాడు. అందుకే ఈ రెండు కలిసి వస్తాయని ఆయన అటు జంప్ కొట్టేశాడు. అదీ మేటర్. ఈ విషయం వివరంగా చెప్పాడు చంద్రబాబు.

ఇందులో మరో సందేశం కూడా ఉంది. అంటే దీన్ని బట్టీ చూస్తే హైద్రాబాద్ లో వ్యాపారాలు, వ్యవహారాలు చేయడం అంత సేఫ్ కాదా ? అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం పెద్ద కష్టం కాదు.చేయొచ్చు. కాకపోతే టీఆర్ఎస్ కి సలాం కొట్టి వాళ్లు చెప్పినట్టు నడుస్తూ, జగన్ పార్టీలో చేరి మరీ బతకాలి. అదీ మేటర్.

-->