చేతులు పట్టుకొని బతిమలాడు వీహెచ్ – ఆ సీటులో నిర్ణయం మార్చేశాడు చంద్రబాబు !

గెలవడం ఒక్కటే కాదు ప్రత్యర్థిని ఓడించడం కూడా ముఖ్యమే ! సీట్ల కేటాయింపులో మహా కూటమి ఇదే ఫార్ములాను ఫాలో అవ్వాలనుకుంటోంది. ఇది చంద్రబాబు చెప్పిన మాటే. అలాంటి చంద్రబాబుకే వీహెచ్ చెప్పిన లాజిక్ షాక్ లా తగిలింది. అందుకే ఆ సీట్ విషయంలో నిర్ణయం మారింది. మరో రెండు రోజుల సస్పెన్స్ తర్వాత తేలిపోతుంది.

తెలంగాణ విషయంలో చంద్రబాబు ఈసారి క్లారిటీతో ఉన్నాడు. బిల్డర్లకి ఇవ్వొద్దు. రియల్ వ్యాపారులకి ఇవ్వొద్దు. వాళ్లు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి పోతారు అని ముందే చెప్పాడు. గత ఎన్నికల్లో గెలిచిన వాళ్లలో ముందు టీఆర్ఎస్ లోకి దూకింది వాళ్లే. పై పెచ్చు ఇప్పుడు తెలంగాణలో టీడీపీ కూటమి గెలవడం ఖాయం అయిపోయింది. అంటే కొత్త చిగుళ్లు రావాలి పార్టీకి. ఇలాంటి సమయంలో భవిష్యత్ ను కూడా దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా చెప్పిన మాట ఇది. సరైన నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు అనిపించింది. కానీ ఆయన మాత్రం సీన్ లోకి వచ్చేశాడు. ఢిల్లీ లెవెల్ నుంచి వియ్యంకుడి దాకా అందరితోనూ ఓ మాట అనిపించేశాడు. చంద్రబాబు అవును అని అనకపోయినా కాదూ అని కూడా చెప్పలేదు. అందుకే నా టిక్కెట్ ఖాయం అని ఆయన ర్యాలీతో ఊరేగుతున్నారు.

కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ చేసిన సూచనతో చంద్రబాబు ఆలోచనలో పడినట్టు కనిపిస్తోంది. వీహెచ్ చంద్రబాబును అభినందించాడు. మీ రాకతో మాకు బలం వచ్చింది అన్నాడు. రియల్టర్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నాడు. అదే వరసలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకి కూడా ఛాన్సు ఇవ్వొద్దు, ఏ మాత్రం అవకాశం ఉన్నా వాళ్లు వెనక్కి పోతారు అది డేంజర్ అని చెప్పాడు. వెంటనే చంద్రబాబు తన పార్టీ లీడర్లనే కాదు కాంగ్రెస్ ను కూడా అలర్ట్ చేశాడు అంటున్నారు. అదే జరిగితే ఆ నియోజక వర్గంలో ఊరేగింపులతో, గొడవలతో పెద్దగా లాభం లేదనుకోవాలి. అవును. తెలంగాణలో టీడీపీ గెలుస్తుందని చెప్పే మొదటి సీటు గురించే ఇదంతా !

-->