బంతి ఒక్కటి … వికెట్లు మూడు.. చాణక్యుడు చంద్రబాబు !

అయ్యా సాయం చేయండి, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నిల బెట్టుకోండి అని ప్రాధేయపడినప్పుడు నో రెస్పాన్స్. ఏపీకి హోదా ఇవ్వడం లేదు, మాకు అన్యాయం జరిగింది అవిశ్వాసం పెడుతున్నామన్నప్పుడూ కాస్తే కదలిక. అదే ఇప్పుడు బాబు ఫ్రంట్ పెట్టి నేరుగా మోడీని ఢీ కొట్టి, బీజేపీని పడగొట్టేందుకు రెడీ అయ్యేసరికి మాత్రం ఫుల్ ఫోకస్ ఏపీవైపే. అన్ని చూపులూ చంద్రబాబు మీదే ! ఏం… ఎందుకని ? ఎందుకంటే బాబు కొట్టింది మాస్టర్ స్ట్రోక్.

చంద్రబాబు కూమిటి ఇప్పుడు నేషనల్ టాపిక్. సేవ్ ద నేషన్ అనేసరికి రాజకీయాల్లో సంచలనం రేగుతోంది. ది నాయుడు ఫ్రంట్ అంటూ నేషన్ మీడియా మొత్తం మన ముఖ్యమంత్రిని చూపిస్తోంది. కేసీఆర్ మెచ్యూరిటీ చూపించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తూనే అభివృద్ధిపై దృష్టి సారించారు అని మోడీ అన్నప్పుడు బీజేపీ అభిమానులు సంబరపడిపోయారు. పక్కలో బల్లెం పెట్టి చంద్రబాబును భలే పొడిచాడు అనుకున్నారు. రాష్ట్రంలో సమస్యలతో లాక్కుంటాడా – కేసీఆర్ తో పీక్కుంటాడా అనుకున్నారు. కానీ చంద్రబాబు రెండూ కాదు. మూడో విండో తెరిచాడు. ఢిల్లీతో ఢీ కొడుతున్నాడు. ఢీ కొట్టి పడగొడితే చాలు అన్నీ సెటిల్ అయిపోతాయ్. ఏపీ సమస్యలు తీరిపోతాయ్. కేసీఆర్ ఒక్కడే కాదు మోడీ, జగన్ తో సహా అందరూ సెటిల్ అయిపోతారు. ఎలాగో తెలుసా ?

1. ఫస్టు పడేది మోడీ వికెట్. నాకు ఎదురు ఎవరు ఎవరు అంటూ విగ్రవీగాడు ఇప్పటి వరకూ. నీకు ఎదురు నేనే అని చెప్పేశాడు చంద్రబాబు. కూటమి కట్టడమే తరువాయి. ఇక చెప్పుకోడానికి గతం తప్ప భవిష్యత్ ఉండదు మోడీకి.

2. కేసీఆర్. వంద సీట్లు బరాబర్ గెలుస్తాం అన్నాడు. ఏదీ ఇప్పుడు గెలుపు అనే మాట చెప్పమనండి చూద్దాం. వంద డిగ్రీలు తగ్గడంలేదు టెంపరేచర్. జ్వరం. ఇదీ చంద్రబాబు దెబ్బే !

3. ఇక కోడి కత్తి పుంజు జగన్ ను కూడా అనుకోకుండా నంజుకుంది చంద్రబాబు ఢిల్లీ టూర్. ఇప్పుడు ఇక గవర్నర్ సాయం అక్కర్లేదు. కేసీఆర్ పరామర్శలతో పని లేదు. బీజేపీ బ్యాకింగ్ ఇచ్చి సాధించేది కూడా ఏం లేదు. ఎందుకంటే ఢిల్లీ ప్రవాహంలో పాత చీపురు కట్టలా కొట్టుకుపోయాడు జగన్. ఒక్క రోజా తప్ప జగన్ గురించి మాట్లాడేవాడు ఎవ్వడూ లేడు. ఇది బిగినింగు. ముందు ముందు పూర్తిగా మర్చిపోతారు !

ఒక్క దెబ్బకి మూడు పిట్టలనో ఒక్క బంతికి మూడు వికెట్లు అనో ఏమైనా అనుకోండి. ఇది ఎర్లీ రిజస్ట్. ఇనీషియల్ ఫలితాలు. అంటే ముందు రాబోయేవి అసలువి. మరిన్ని కూడానూ ! అందుకే వెయిట్ అండ్ సీ. ఇది చంద్రబాబూస్ టైమ్ !

-->