ఏపీలో కాంగ్రెస్ తో పొత్తా ? పోటీనా ? వైసీపీని ఎలా సమాధి చేస్తాడు చంద్రబాబు ?

కాంగ్రెస్ భుజం మీద తుపాకి పెట్టి వైసీపీని కొట్టేశాడు చంద్రబాబు. అనుమానం లేదు. అందుకే వైసీపీ అల్లాడిపోతోంది. లక్ష్మీ పార్వతితో నిరసన చేయిస్తోంది. అన్యాయం దుర్మార్గం అంటోంది. ఏంటి చంద్రబాబు కాంగ్రెస్ ని నిలబెడితే జగన్ ఎందుకు పడిపోతాడు ? అదే మరి అసలు పాయింట్ !

సెకండ్ ప్లేస్ మీద ష్యూరిటీ లేదు కానీ థర్డ్ ప్లేస్ మీద వైసీపీకి క్లారిటీ వచ్చేస్తోంది ! ఏపీలో కూడా చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే థర్డ్ ప్లేస్ కచ్చితంగా జగనే కొట్టేస్తాడు. సెకండ్ ప్లేస్ కి పవన్ ఎగబాకుతాడేమో చూడాలి ! ఈ లెక్కన టీడీపీ స్కోరు 140 దాటినా ఆశ్చర్యం లేదు. ఏంటి కాంగ్రెస్ తో పెట్టుకుంటే లెక్క అంత మారుతుందా ? అవును. ఇదంతా కాంగ్రెస్ బలం కాదు. జగన్ పార్టీ బలహీనత. జగన్ పార్టీకి ప్రత్యేకంగా బేస్ లేదు. కాంగ్రెస్ చచ్చిపోయింది కాబట్టి వైసీపీకి ఓట్లు పడ్డాయ్ గత ఎన్నికల్లో ! విభజన చేసిన కసి కాంగ్రెస్ మీద పచ్చిగా ఉంది అప్పుడు. అందుకే వలతో సహా పావురాలు ఎగిరిపోయినట్టు ఓట్లతో సహా పార్టీ మారిపోయారు కాంగ్రెస్ విధేయులు. ఇప్పుడు పరిస్థితి అలా కాదు. బీజేపీ చేసిన ద్రోహం కాంగ్రెస్ ని సెకండ్ ప్లేస్ లోకి నెట్టింది. వీళ్ల కంటే వాళ్లే నయం అనిపించింది. అన్నిటికీ మించి రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తా ఏపీకి, ఇవ్వకపోతే నేను మళ్లీ రాను అటు వైపు అని తెగేసి చెప్పాడు. పైగా రెడ్లు అంతా గెలిచే పార్టీ వైపు ఉండాలన్న నిర్ణయానికి వస్తున్నారు. ఎనిమిదేళ్లుగా జగన్ ను చూసి చూసి విసుగెత్తి పోయారు. అందుకే టీడీపీతో కలిస్తే కుక కాంగ్రెస్ కి ఓట్లు పెరుగుతాయ్. గెలుస్తుందో లేదో తెలీదు కానీ వైసీపీ ఓట్లు చీలిపోయి చతికిలపడి విలవిల్లాడుతుంది. ఖాయంగా !

అందుకే చంద్రబాబు కాంగ్రెస్ కలిస్తే లోటస్ పాండ్ లో వస్తున్నాయ్ ప్రకంపనలు. ఎందుకంటే సీట్లు కాంగ్రెస్ వి, ఓట్లు కాంగ్రెస్ వి, ఆఖరికి జగన్ పార్టీలో నేతలు కూడా అక్కడి వాళ్లే ! ఇప్పుడు అదే పార్టీ పుంజుకుంటే కనుక వైసీపీ పరిస్థితి ఏంటి ? చంద్రబాబు డిసెంబర్ 11 తర్వాత వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంటాడు అనిపిస్తోంది చూడబోతే ! కాంగ్రెస్ తో నేరుగా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నిజానికి ఏపీలో ! అందుకే 175 నియోజక వర్గాల్లో పోటీ చేసేలా చూస్తే చాలు. జగన్ పార్టీ మటాష్ అయిపోడానికి . బహుశా అదే జరుగుతుందేమో !

-->