మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి రెడీ ! రేపే ఢిల్లీలో ప్రకటన !

మోడీ భయపడినంతా అయ్యింది. చంద్రబాబు ఢిల్లీ లెవెల్లో కొట్టాడు దెబ్బ. తెలుగు దేశం మళ్లీ దేశాన్ని ఏకం చేసింది. చంద్రబాబు కూటమి ప్రకటించబోతున్నాడు. రేపే ఢిల్లీలో ముహూర్తం. సేవ్ నేషన్ పేరుతో బాంబ్ పేల్చబోతున్నాడు. పొలిటికల్ బ్లాస్ట్ చేయబోతున్నాడు రేపు ఢిల్లీలో !

చంద్రబాబు కూటమి పేరు సే ద నేషన్. చంద్రబాబు డిసైడ్ అయిపోయాడు. మోడీ సైడ్ అయిపోవడం ఇక లాంఛనమే. మోడీకి వ్యతిరేకంగా కూటమి కట్టేశాడు. రేపు రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాడు. చంద్రబాబుకి రాహుల్ గాంధీ ఫోన్ చేసి ఆహ్వానించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయ్. ఇప్పటికే జాతీయ స్థాయిలో అరడజను పార్టీలను కలిశాడు చంద్రబాబు. మాయావతి లాంటి వాళ్లు దీవించారు. మమత లాంటి వాళ్లు ముందు నుంచి పోరు పెడుతున్నారు చంద్రబాబు ఢిల్లీ రావాలని. అఖిలేష్ కూడా ఫోన్ చేసింది అందుకే. ఇప్పుడు రాహుల్ గాంధీ రంగంలోకి వచ్చాడు. కూటమిని చంద్రబాబు స్వయంగా ప్రకటిస్తారని అంటున్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, మోడీ అన్ని రంగాల్లోనూ విఫలం అయ్యాడని, అర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యిందని, మోడీ అమిత్ షా దేశం మీద రాజకీయ రాబందుల్లా పడ్డారని దుమ్మెత్తి పోసి దులిపేయబోతున్నాడు చంద్రబాబు. ఇక యుద్ధం ఢిల్లీలో. చంద్రబాబు సిద్ధం.

చంద్రబాబు రెడీ అయిపోయాడు. బాబు డిసైట్ అయితే ఇలాగే ఉంటుంది. పట్నాయక్ లాగో మరొకరిలాగో ఒంటికాయ సొంఠి కొమ్ములా సింగిల్ గా ఉండిపోడు. కూటమి కడతాడు.అందరినీ ఏకతాటిపైకి తెస్తాడు అని బీజేపీ ముందు నుంచి భయపడుతోంది.ఇప్పుడు అనుకున్నంత పనీ అయ్యింది. కాంగ్రెస్ కూడా బాబు స్పీడు గమనించింది. మీ వెనకే ఉండి మేం సపోర్ట్ చేస్తామంటోంది. అంటే వెనక్కి తగ్దింది. ఇప్పుడు ఖాయం అయిపోయింది. ఢిల్లీలో మోడీని పడగొట్టేది చంద్రబాబే. అందుకే ఈ కూటమి పేరు సేవ్ ద నేషన్ ! సాహో చంద్రబాబూ !

-->