వర్మ ట్రయిలర్ మీద చంద్రబాబు రియాక్షన్ సూపరో సూపర్ ‍! పంచ్ పేలిపోయింది !

కుక్క కరిస్తే – ప్రతీకారంగా మళ్లీ కరవలేం ! అలాగని కరవలేకపోవడం చేతగాని తనం కాదు. విజ్ఞత. ఇది కూడా అంతే ! ఎవడో ఏదో చెలరేగిపోయాడని ఇటు వైపు నుంచి కూడా అంతే మోతాదులో రియాక్షన్ వచ్చేస్తుందని ఆశించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాణ్ని ఆ రియాక్షనే పెద్దది చేస్తుంది. చంద్రబాబు లాంటి నాయకుడు, టీడీపీ లాంటి పార్టీ అలాంటి ఛాన్సు ఇవ్వనే ఇవ్వదు. చంద్రబాబు రియాక్షన్ తెలిసిన వాళ్లకి, వర్మ ట్రైలర్ మీద రెస్పాన్స్ కూడా అర్థమైంది అందుకే !

లక్ష్మీ పార్వతిని జనం ఎప్పుడో తిరస్కరించారు. రెండు దశాబ్దాలు దాటింది అందుకే ఆమె రాజకీయం గల్లంతు అయిపోయింది. కనీసం విలువ కూడా లేదు ఆమెకు ! ఆమె వైపు నుంచి, ఆమె ఓ సాధ్వీమణి అనే రేంజిలో వర్మ ఎత్తుకున్న సినిమాకు ఉండే వేల్యూ ఎంత ? అహా, చిన్న నోటి లెక్క వేసుకోండి. అందుకే అనిపిస్తోంది ఇప్పుడు – శివతో మొదలై రామ రామ అనిపించేట్టు ముగుస్తోంది ఓ కెరీర్ అని. శాపనార్థం కాదు ఇది. యదార్ధం. తీయడానికి చూపించడానికి ఏం లేనప్పుడే ఊడదీయడం మొదలవుతుంది. డర్టీ పిక్చర్ లో చెప్పలా ! అలాగ ! అయినా ఎన్టీఆర్ మీద సినిమాలు కొత్తా ? గంటిపేట రహస్యాలూ, మండలాధీశుడు ఇతరత్రా కలిపితే ఓ అరడజను కొట్టేసి ఉంటారు ఇప్పటికే ! కాకపోతే అప్పటికీ ఇప్పటికీ రెండే తేడాలు. అప్పుడు సోషల్ మీడియా కామెంట్లు, షేర్లూ లేవు. రెండోది అప్పుడు వైసీపీ కూడా లేదు. భలే భలేగుంది అని చెట్టుచాటు నుంచి చప్పట్లు కొట్టడానికి ! వాళ్ల సినిమానే వాళ్లు ఆడించలేకపోయారు, వర్మకి ఆళ్లు నీళ్లొస్తారేంటి అని అడిగితే కూడా బాగా ఉంది లాజిక్కు. నిజమే ! మరి ఇలాంటప్పుడు ఆ సినిమా గురించి రియాక్ట్ అవ్వడం అంటే అనవసర పబ్లిసిటీ ఇవ్వడమే. చంద్రబాబు ఇప్పుడే కాదు. ఎప్పుడూ ఆ పని చేయడు. చేయనివ్వడు. అందుకే కనీసం ఆయన దగ్గర ప్రస్తావించే సాహసం కూడా చేయడం లేదెవ్వరూ ! గతంలో ఓ సందర్భంలో లక్ష్మీ పార్వతి విమర్శలు ఎవరో ప్రస్తావిస్తే – మళ్లీ బతికించాలనుకుంటున్నావా నువ్ అని అడిగాడట చంద్రబాబు సింపుల్ గా ! అందుకే మళ్లీ మాట్లాడ్డం లేదిప్పటి వరకూ. రియాక్షన్ ఇలాగే ఉంటుంది.

ఎన్ని చెప్పినా సగటు అభిమానికి మాత్రం చేతులు ఊరుకోవు. రియాక్షన్ ఇచ్చి తీరాల్సిందే. మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలి అనే ఉత్సాహం తరుముతూ ఉంటుంది. ఇలాంటి వాళ్లకో క్లారిటీ ఏంటంటే- ఎవరి వైపు నుంచి ఎలాంటి కౌంటర్ ఉంటుంది, లీగల్ గా ఏం చేస్తారు ? అనేది ఓ పద్ధతి ప్రకారం నడుస్తూనే ఉంటాయ్. డోన్ట్ వర్రీ ! ఇట్స్ ఎ పెట్టీ ఇష్యూ !

-->