చంద్రబాబు మనసులో ఉన్న ప్రధాని అభ్యర్థి ఆయనే ! మోడీ అవుట్ !

చంద్రబాబు ప్రధాని అవుతారని కొందరు, లేదు ప్రధాని అభ్యర్థి ఎవరో డిసైడ్ చేస్తారని ఇంకొందరు అంటున్న సమయంలో ఢిల్లీలో సంచలన సంగతి బైటపడుతోంది. ప్రాంతీయ పార్టీల నాయకుల సమావేశంలో చంద్రబాబు చిన్న క్లూ ఇచ్చారు. బాబు మనసులో ఉన్న ప్రధాని అభ్యర్థి ఆయనేనా ? బాబు ఫిక్సయ్యారా ?

ఏపీ కష్టాలకు ఎదురీదుతున్న సమయంలో నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం. రాష్ట్రాన్ని అణిచేసి దేశాన్ని అభాసుపాలు జేస్తున్న మోడీని దించాలన్నది ఎత్తుగడ. అంతే కానీ ఇప్పటికిప్పుడు ప్రధాని కావాలన్న ఆశ కాదు. అందుకే నేను నిర్ణయిస్తాను కానీ కుర్చీ ఎక్కాలనుకోవడం లేదు అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. ఎవరు అయితే బావుంటుందో కూడా సూచన ప్రాయంగా చెప్పారు అంటున్నారు. మోడీ ఇప్పటి వరకూ విర్రవీగిపోయాడు. నాకు ప్రత్యర్థి ఎవరు అంటూ ప్రశ్నించాడు. ఇప్పుడు సమాధానం దొరికేసింది. చంద్రబాబు. అవును. చంద్రబాబే మోడీకి ప్రత్యర్ధి. చంద్రబాబును చూసే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం అవుతున్నాయ్. రాహుల్ గాంధీ నాయకత్వం మీద నమ్మకం లేక, కాంగ్రెస్ తో కలవడం ఇష్టం లేక ఇప్పటి వరకూ దూరంగా ఉన్న పక్షాలన్నీ ఇప్పుడు ఒక్కతాటిపైకి వస్తున్నాయ్. అందుకే ఇప్పుడు మమత, మాయ, పవార్, అఖిలేష్ అంతా సై అంటున్నారు. ఇలాంటి సమయంలో మోడీకి దిమ్మదిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు చంద్రబాబు. మోడీ భావజాలానికి పూర్తి వ్యతిరేకంగా, జాతీయ స్థాయిలో తిరుగులేని అప్లాజ్ వచ్చేవిధంగా, కాంగ్రెస్ కూడా కాదనలేని పరిస్థితుల్లో పడేట్టుగా ఆల్టర్ నేటివ్ చూపించబోతున్నాడు. ఖాయం. అందుకే ఇప్పుడు బాబు నిర్ణయం జాతీయ స్థాయిలో సంచలనం అవుతోంది.

మైనారిటీ వర్గాలకి ఆయన ప్రతినిధి. దేశాన్ని దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్య పరిష్కరించగల్గిన స్థాయి ఉన్నవాడు. రాజకీయంగా బలం ఉంటే సాధ్యమే. చంద్రబాబు తల్చుకుంటే అయ్యేపనే ! అందుకే ఇప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి, పార్టీల ఐక్యతతోపాటు బీజేపీ తట్టుకోలేని పరిస్థితి సృష్టించేందుకు చంద్రబాబు ఆ అభ్యర్థి పేరు ప్రకటిస్తాడు అంటున్నారు. కాకపోతే కాస్త సమయం ఉంది. అంతే !

-->