కేసీఆర్ కోరినట్టే చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ ! మరి చంద్రబాబు సెట్ చేయలగడా ?

కర్ర విరక్కుండా పాము చావకుండా డీల్ చేయాల్సిన మేటర్ ని కూడా కర్ర విరిచేసి పాముకి పాము మందేసి బతికించేట్టు చేస్తుంది కాంగ్రెస్. చేతిలో పడ్డ క్యాచ్ ని కూడా నేలపాలు చేయడం వాళ్లకి మాత్రమే తెలుసు. వాళ్లది పీహెచ్ డీ రేంజి. అంతా కలిసొస్తున్న తెలంగాణలో ఇఫ్పుడు కాంగ్రెస్ అంతా కేసీఆర్ కోరినట్టే చేస్తోంది. చంద్రబాబు దిగితే తప్ప సెట్ కాదేమో పరిస్థితి !

ఇప్పటికే టీఆర్ఎస్ ఏడుస్తోంది. ఎక్కడో ఊరవతల ఉన్న కాంగ్రెస్ ని తెచ్చి టీఆర్ఎస్ తో ఢీ కొట్టించాడు చంద్రబాబు. కాంగ్రెస్ రాజకీయాన్ని డిసైడ్ చేస్తున్నది చంద్రబాబే. ఆయన ఆడిస్తున్నట్టే ఇక్కడ ఆడుతున్నారు – అంటోంది. అనుకుంటే అనుకోనివ్వండి కానీ ఇప్పుడు పాయింట్ తెలంగాణ కాంగ్రెస్ లో చేతగాని నిర్వాకాల గురించి. టిక్కెట్లు ఇంకా ప్రకటించనే లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ లో నాయకులు ఇళ్ల ముట్టడి వరకూ వెళ్లిపోయారు. టిక్కెట్లు రాని వాళ్లు పీసీసీ చీఫ్ తోపాటు మిగతా ముఖ్య నాయకుల మీద తిరగబడుతున్నారు. మా సంగతి ఏంటి అంటున్నారు. దాదాపు రెండు నెలలకుపైగా సమయం ఉంది. సీట్ల మీద పొత్తుల మీద చర్చిస్తున్నారు. ఇలాంటప్పుడు టీడీపీ సిట్టింగులేవో మిగతా మిత్ర పక్షాలు అడిగే సీట్లేవో కాంగ్రెసి కి తెలియదా ? తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి కదా ! టిక్కెట్లు వచ్చే అవకాశం లేని వాళ్లని కాస్త బుజ్జగిస్తూ దారిన పెట్టుకొనే చర్యలు తీసుకోవాలి కదా ! ఎవడికి పట్టింది ? కాంగ్రెస్స్ అంటేనే అంత. ఎవడ లెక్క వాడిది. పార్టీని పట్టించుకునే దిక్కే ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది వాళ్ల బతుకు !

ఇప్పుడు నల్గొండలో రగిలింది. హైద్రాబాద్ శివార్లలో అంటుకుంది. లింగం పల్లి లాంటి చోట్ల కాంగ్రెస్ నాయకులు తిరగబడుతున్నారు. ఇలాగే చేసుకుంటూ పోతే ముందు ముందు మంటలు కేసీఆర్ కి కలిసొస్తాయ్. కేసీఆర్ ఎదురు చూస్తున్నది కూడా అందుకే నిజానికి ! ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. మరి చంద్రబాబు రంగంలోకి దిగి సెట్ చేస్తే తప్ప కాదేమో ! చూడాలి.

-->