మన దగ్గర ఓడేవాళ్ల కోసం కూడా మూడు పార్టీలు స్కెచ్ వేస్తున్నాయ్ ! అదీ టీడీపీ రేంజ్ ! వలసలపై చంద్రబాబు డైలాగ్ అదిరింది !

అవకాశం లేనోళ్లు పోతారు – భవిష్యత్ కావాలనుకునే వాళ్లు వస్తారు ! అవకాశాలు లేకపోతే, మరోసారి టిక్కెట్ రాదని తెలిసిపోతే, లేదంటే మళ్లీ గెలవలేం అనుకున్నవాళ్లు వెళ్లిపోతారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీలో ఇప్పుడు ఎంత పోటీ ఉందో మీకు తెలుసు. ఇక భవిష్యత్ ఉండాలి, గెలిచే పార్టీలో ఉండాలి అనుకునేవాళ్లు వస్తారు – అంటూ మొదలు పెట్టి టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు చెప్పిన వాస్తవాలు టీడీపీ నేతలతో చప్పట్లు కొట్టించాయ్. ఇంతకీ బాబు ఏం చెప్పాడో చూడండి !

రవీంద్ర సంగతి మీకు తెలుసు. అద్భుతమైన అవకాశం ఇచ్చాం. సందేహం లేదు. ఈసారి అతను గెలిచే పరిస్థితి లేదు. అక్కడ బాలయోగి తనయుడు దిగుతున్నారు బరిలో. బాలయోగి కుటుంబం బరిలో ఉంటే ఎవరికైనా డిపాజిట్ గల్లంతు అవుతుంది. పార్టీ క్షేమం, బాలయోగి కుటుంబానికి న్యాయం దృష్టిలో పెట్టుకుంటా అని చెప్పిన తర్వాత ఆయన వెళ్లిపోయాడు. అవంతి పరిస్థితి కూడా అంతే ! అక్కడ కొణతాల లాంటి నాయకులు పోటీలో దిగేందుకు సై అంటున్నారు. ఈయనకి భయం పట్టుకుంది. చీరాల, రాజంపేట లాంటి చోట్ల కూడా వెళ్లిపోయినందు వల్ల మనకి లాభమే, అడ్వాంటేజ్ వచ్చింది తప్పితే నష్టం లేదు. వీళ్లంతా భయంతో జారుకున్నారు. జగన్ పార్టీ అసలు పోటీలోనే లేదు అనే ఫీలింగ్ ఉంది. అందుకే ఎవరో ఒకరిని చేర్చుకొని కష్టపడుతున్నారు. పైగా ఆ చేర్చుకునేది కూడా జగన్ కాదు. టీఆర్ఎస్, బీజేపీ చేరుస్తున్నాయ్. టీడీపీకి ఇప్పుడు అంత రేంజ్ ఉంది. మనల్ని టార్గెట్ చేసేందుకు ఒక్కరు సరిపోరు. మూడు పార్టీలు అందుకే ఏకమయ్యాయ్ అని చంద్రబాబు చెబుతుంటే చప్పట్లు మోత మోగిపోయాయ్.

జనంలో బలం ఉన్నంత వరకూ, జనం మనం రావాలి అని కోరుకుంటున్నంత వరకూ ఇలాంటివి ప్రభావం చూపలేవు. పైపెచ్చు నా పని సులభం చేసేశాయ్. లేదంటే వాళ్లని మెప్పించడానికి, ఒప్పించడానికి కష్టపడాల్సి వచ్చేది అంటున్నప్పుడు చంద్రబాబు ముఖంలో నవ్వు తొణికిసలాడింది. ఇంకొద్ది మంది తప్పుకున్నా నష్టంలేదని, ఇలాంటి వాటికి బెదరొద్దని స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు !

-->