అడుగు ఢిల్లీలో – అదిరింది హైద్రాబాద్ ! చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కేసీఆర్ అర్థరాత్రి మీటింగ్ !

చంద్రబాబు ఇప్పుడు పెట్టిండు దుకాణం, పోయి పోయి ఇప్పుడు గూట్లో చిక్కుకున్న పిట్ట మాదిరి అయిపోయింది పరిస్థితి. ఏం చేస్తడు, ఇంకా కష్టమైతదా మనకి ? ఏం చేయాలి మనం ? అంటూ అర్థరాత్రి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు కేసీఆర్. ఇదొక్కటి చాలు చంద్రబాబు ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి !

అదును చూసి పదును చూపించడం అంటే ఇదే. సరైన సమయంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు. ఢిల్లీలో ఫ్రంట్ కట్టడం, ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడం లాంటివి చంద్రబాబుకి కొత్త కాదు. పైగా ఎన్డీయే నుంచి బైటకి వచ్చినప్పుడే అజెండాలో అవన్నీ ఉన్నాయ్. కాకపోతే సరిగ్గా నాల్గు పెద్ద రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు ఢిల్లీలో స్పీడు పెంచడం వ్యూహాత్మకం. మోడీ వ్యతిరేకంగా పార్టీలు ఏకం కావడం, అన్నిటికీ చంద్రబాబు కీలకం కావడం ఇక్కడ పాయింట్. మోడీకి కౌంట్ డౌన్ మొదలైంది అని తేలిపోయాక ఇక మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లాంటి చోట్ల కూడా వార్ వన్ సైడ్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ మరింత బేజారు అయిపోతుంది. ఇఫ్పటికే పార్టీ గ్రాఫ్ పడిపోయింది.

ఇలాంటి సమయంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కేసీఆర్ లో ఆందోళన పెరిగింది. ఈ బాబేంటి ఇప్పుడు హంగామా చేసుడేంది, మనం ఎలా తిప్పికొట్టాలె, ఎలాంటి వ్యూహంతో వెళ్లాలే అనేది మనకి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటది. మీరు గాభరా పడకండి. ఏం జరుగుతున్నది, ఏం చేయాలన్నది మీ ఆలోచనలు నాతోని షేర్ చేయండి అని సీనియర్లతో సమావేశం అయ్యాడు. మొత్తం ఏడుగురు పాల్గొన్నారు మీటింగ్ లో ! వరంగల్ లాంటి చోట్ల ఉన్న వాళ్లతో అప్పటికప్పుడు ఫోన్లో కూడా మాట్లాడాడు. అంటే ఢిల్లీలో అడుగేస్తే హైదరాబాద్ లో అదురుతోంది. ఖాయం.

-->