వైసీపీ నుంచి కూడా వలసలు ఉంటాయ్ ! ఆరు నెలలు గడుపు ఇచ్చాం ! బాంబు పేల్చిన కన్నా !

కన్నా రాజకీయాల్లో క్వాలిటీ బాగా పెరిగినట్టు ఉంది ఈ మధ్య ! బహుశా ఢిల్లీ నుంచి వస్తున్న గైడెన్స్ అలాంటిది అనుకుంట ! ఆయన ఇక్కడ విషయాలే కాదు దేశ రాజకీయాలు కూడా మాట్లాడుతున్నాడు. గుంటూరోళ్లకి సంతోషం. సరే కానీ ఆరు నెలల గడువు అని ఎందుకు అన్నారు ? వైసీపీ నుంచి వలసలు ఉంటాయ్ అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి ? కన్నా విసిరిన బాంప్ ఎప్పుడు పేలబోతోంది ? కన్నా క్లియర్ గా చెప్పేశారు. విజయనగరంలో తేల్చేశారు. టీడీపీ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉన్నాయ్. ముందు ముందు మరిన్ని ఉంటాయ్ అన్నారు. అటు తర్వాత టీడీపీ నుంచే కాదు వైసీపీ కూడా వలసలు ఉండబోతున్నాయ్ అని చెప్పారు. భవిష్యత్ బీజేపీది అని అందరూ అనుకోబట్టే తమ పార్టీ వైపు చూస్తున్నారని కన్నా చెబుతున్నారు.

ఇప్పటికే వైసీపీ లీడర్లు కూడా చాలా మంది సంప్రదించారని, వాళ్ల చేరికలు తొందర్లో ఉంటాయని ఆయన చెబుతున్నారు. జగన్ ప్రభుత్వ పని తీరుపై ఇప్పుడే మాట్లాబోననన్నారు కూడా ! ఎందుకంటే వచ్చి రెండు నెలలే అయ్యింది. ఆరు నెలలు అయ్యాక అసలు వరస ఎలా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే ప్రభుత్వం వైపు నుంచి, వాటి మీద మాత్రం మాట్లాడతాం. అసలు విధానాలు, పాలసీల విషయంలో మాత్రం ఆరు నెలల తర్వాతే క్లారిటీ వస్తుంది. అప్పుడే చెబుతా అంటున్నారు కన్నా ! మొత్తానికి ఒక విషయం మాత్రం క్లియర్ చేసేశారు. టీడీపీతో వైరం ఎలాగూ ఉంది. అలాగని వైసీపీతో స్నేహం ఉన్నట్టు కాదని – ఆ పార్టీ మీదకి కూడా కాలు దువ్వుతున్నామని నేరుగా ప్రకటించేశారు కన్నా ! బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దూకుడుగా ఉండబోతోందని కూడా చెప్పేశారు అనిపిస్తోంది విజయ నగరం ప్రకటన చూశాక. మరో మాట ఏపీలో నేతలు పార్టీ మారితే పదవులకి రాజీనామా చేయాలని జగన్ ఆల్రెడీ అసెంబ్లీలో ప్రకటించేశారు. మరి బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది పాయింట్.

ఎందుకంటే బీజేపీలోకి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో చేరారు అనుకోండి. మరి వారిని వైసీపీ డిస్ క్వాలిఫై చేయగలదా అనేది పాయింట్. స్పీకర్ నిర్ణయమేగా కీలకం. అటు తర్వాత వైసీపీ నుంచి కూడా సిట్టింగులు ఎవరైనా బీజేపీ వైపు వెళితే ఏంటి పరిస్థితి అనేది కూడా తేలాల్సి ఉంది. బహుశా వీటన్నిటిపై క్లారిటీ రావాలనే ఆరు నెలలు గడువు అన్నారేమో మరి !

-->