రిపబ్లిక్ టీవీ సర్వేల వెనక అసలు సీక్రెట్ ఇదే

ఐదు సీట్లు దేకలేనోడు అందలం అందుకుంటాడని చెబుతోంది రిపబ్లిక్ టీవీ. అవును, ఉప ఎన్నికలు వస్తే ఉన్న గోచీ ఊడిపోద్దని భయపడి, బీజేపీతో ఒప్పందం చేసుకొని ఓకే అన్నాకే రాజీనామాలు చేశారు వైసీపీ ఎంపీలు. ఉప ఎన్నికలు అంటే అంత ఠారెత్తిపోతోంది. అలాంటి చేవలేని, లేవలేని పార్టీని జాకీ లేసి ఎందుకు లేపుతోంది రిపబ్లిక్ టీవీ ? అసలు ఎలా నడుస్తోంది ఈ ఆపరేషన్ ?

చూస్తుండగానే 15 రోజులకో సర్వే వచ్చి పడుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనే కాదు ఆరు నెలల ముందే పార్లమెంటు ఫలితాలు కూడా చెప్పేస్తోంది రిపబ్లిక్ టీవీ. ఎలా? ఏపీలో అసలు ఎప్పుడు చేస్తున్నారు సర్వే ఎవరు చూస్తున్నారు బాధ్యతలు ? ఆ సంగతి తెలిస్తే వివరం వచ్చేస్తది !

ఇంగ్లిష్ న్యూస్ ఛానెళ్లకి దక్షిణాది అంటే చెన్నై, బెంగళూరు. కాస్తో కూస్తో హైద్రాబాద్. ఇప్పుడు ఏపీ కోసం అమరావతి అఫ్పుడప్పుడూ వస్తున్నారు. ఓకే. బీజేపీ ముద్ర వేసుకున్న రిపబ్లిక్ టీవీ పదే పదే సర్వేలంటూ ఫలితాలు వదులుతోంది కదా. జగన్ కి 20 లోక్ సభ సీట్లు వస్తాయ్ అంటోంది కదా ఎప్పుడు చేశారు సర్వే ? ఎలా చేశారు ? సింపుల్. రిపబ్లిక్ టీవీ ఓ తమిళ జర్నలిస్టుకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సర్వేలు చూడాల్సిన బాధ్యత ఆయనదే. సరిగ్గా చదవండి, సర్వేలు చూడాల్సిన బాధ్యత ఆయనదే. చేయాల్సిన బాధ్యత కాదు. ఎందుకంటే 15 రోజులకోసారి సర్వేలు చేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా తమిళోడు వచ్చి ఇక్కడ పొడిచేది ఏం లేదు. అందుకే ఉజ్జాయింపుగా, తాము అనుకున్న నంబర్ వేసుకుంటూ పోతున్నారు. ఆ సర్వమంగళమ్ స్వయంగా ఈ విషయం చెప్పాడు మిగతా ఇంగ్లిష్ ఛానెళ్లకి. ఎప్పుడైనా 42 శాతానికి తగ్గకుండా ఉండాలి, అటుపైన పెరిగినట్టు కనిపించాలి తప్పితే తగ్గకూడదని మాత్రం కండిషన్. ఆ సర్వమంగళం ఉండేది కూడా హైద్రాబాద్ లోనే. పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ని హైర్ చేసినట్టు రోల్స్ లో చూపుతున్నానని, కేస్ట్ ఈక్వేషన్స్, రోజువారీ వ్యవహారాలు పేపర్లలో చూస్తానని ఆయనే ఓపెన్ గా చెప్పాడు. అంటే సిస్టమ్ ముందు కూర్చొని ప్రిపేర్ చేసిన సర్వే అనమాట. అంటే తెలుగు కూడా రానోడు వేసిన అంకెల్నీ, లింకులు కూడా లేని లంకెల్నీ, పొంతన లేని అర్నాబ్ రంకెలనీ మనం చూస్తున్నాం అనమాట.

-->