వంద కోట్లు ఖర్చు పెట్టినా గెలవను ! చంద్రబాబు రాకుండా ఉండాల్సింది ! భవిష్యత్ పై టీఆర్ఎస్ కోటీశ్వరుడి ఆవేదన !

కోట్లకి కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదన్నా ! నేను టీఆర్ఎస్ లోకి వచ్చినప్పటి నుంచి చేసిన ఖర్చు సినిమాల్లో పెట్టి ఉంటే టాప్ సెలెబ్రిటీ అయ్యేవాణ్ని. కన్ స్ట్రక్షన్ లే వేసి ఉంటే బ్రహ్మాండమైన బ్రాండ్ వచ్చేది. ఇక్కడకొచ్చి ఇరుక్కుపోయా ! చంద్రబాబు వస్తాడని మేమే కాదు కేసీఆర్ కూడా ఊహించలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ కష్టమే అనేశాడు. పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు ఇదో లేటెస్ట్ ఎగ్జాంపుల్.

ఆయన తండ్రి లెఫ్ట్. ఆయన మాత్రం అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఫస్ట్. కాంగ్రెస్ తరపున గెలిచాడు అందుకే. ఆ తర్వాత టీఆరెస్ లో చేరిపోయాడు. అంతా బావుంది. మళ్లీ మనమే అనే ధీమాతో ఉన్నాడు రెండు నెలల ముందు వరకూ ! ఈ రెండు నెలలుగా మాత్రం కాన్ఫిడెన్స్ ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోతోంది. ఒళ్లు నొప్పులు తప్ప లాభం లేదు. జనం తిడతన్నారన్నా, దానికి తోడు ఆ టీడీపీ వాళ్లు అంత మంది ఎక్కడున్నారు ఇంత కాలం ! చీమలు పుట్టల్లోంచి వచ్చినట్టు వస్తున్నారు. నీ యెబ్బ వాళ్లు జెండాలతో సిటీలో కలరే మారిపోయింది. ఎటు చూసినా పసుపొచ్చేసింది. అయినా చంద్రబాబుతో కెలుక్కోకుండా ఉండాల్సింది. ఓ పది సీట్లు ఇస్తే ఊరుకునేవాడు. అనవసరంగా ఓవరాక్షన్ చేసి ఇంత వరకూ తెచ్చాడు అంటున్నారు.

ఇది ఒక్క ఖమ్మం జిల్లాలో పరిస్థితి మాత్రమే కాదు. నల్గొండ, హైద్రాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ – అన్ని చోట్లా ఇంచు మించు ఇదే సీన్. డైలాగులు మారుతున్నాయ్ అంతే. లాగూలు మాత్రం అలాగే తడుస్తున్నాయ్. డబ్బు పోసి గెలవొచ్చు అనే పరిస్థితి ఇప్పుడు లేడు. జనంలో ఇంత వ్యతిరేకత ఎందుకు గుర్తించలేకపోయామో తెలియడం లేదు. అయినా బాబు వచ్చాక పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ఏడవలేక నవ్వినట్టు, ఇంట్లో కూర్చోలేక ప్రచారం చేస్తున్నా అంటున్నాడు ఆయన.

-->