చంద్రబాబును తిట్టాక 20 సీట్లు పోయినయ్ బావా ! భోరుమన్న కేసీఆర్ !

కేటీఆర్ ఎందుకు సైబాల్ డబ్బా పట్టుకొని తిరుగుతున్నాడు ? ఆంధ్రా వాళ్లు ఎక్కడ కనపడినా, వద్దన్నా వదలకుండా రాచేస్తున్నాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సికాకుళంలో తిరుగుతున్నారు. సహాయ కార్యక్రమాలు చేస్తామంటున్నారు. మేటరేంటో కేసీఆర్ ఒక్క మాటలో చెప్పేశాడు ! బావా 20 సీట్లు పోయినాయ్ అంటున్నాడు !

కేసీఆర్ లెక్క ప్రకారం 80 సీట్లకి ఢోకా లేదట. పైకి వంద అని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లోనూ 80 గెలుస్తామని మొన్నటి వరకూ చెప్పాడు. చంద్రబాబుపై నోరు పారేసుకున్నాక, చంద్రబాబు ఎవడు తెలంగాణలో తిరగడానికి అని పేలిన తర్వాత లెక్క తీస్తే ఆంధ్రా ప్రభావం ఉన్న ప్రాంతాల్లోనే కాదు మహబూబ్ నగర్ లాంటి చోట్ల కూడా టోటల్ గా 20కిపైగా సీట్లు తగ్గాయ్. టీడీపీ ఉనికి ఉన్న ప్రతిచోటా ప్రకంపనలు ఉన్నాయ్. అర్థం అయింది విషయం. అందుకే చంద్రబాబును తిడితే ఏపీని తిట్టినట్టు కాదు అంటూ కొత్త లాజిక్ లాగబోయారు. అంతలోనే అది కూడా ఎదురు కొట్టింది. కేసీఆర్ ని తిడితే తెలంగాణను తిట్టినట్టు అన్నారు కదా, మరి చంద్రబాబుని తిడితే ఏపీని అన్నట్టు ఎందుకు కాదు అనే సరికి గోతిలో పడింది టీఆర్ఎస్. గ్రాఫ్ పడుతోంది. రోజురోజుకూ పార్టీ చిచ్చి శల్యం అయిపోతోంది. అర్థం అవుతోంది. అందుకే అంతర్మథనంలో పడ్డాడు కేసీఆర్.
కూటమి అభ్యర్దుల్ని ప్రకటించిన తర్వాత మనకి అడ్వాంటేజ్ వస్తుంది అంటూ కేసీఆర్ ఇప్పుడు కొత్త కోణాలు బైట పెడుతున్నారని సమాచారం.

అంటే కూటమిలో లుకలుకలు, ఓ పార్టీ ఆశించిన చోట మరో పార్టీ పోటీ చేయడం లాంటి వాతావరణం వస్తుంది. అదే అదునుగా మనం మధ్యలో దూరి అభ్యర్థుల్ని గుంజుకోవడమో, లేదంటే కూటమిలో పార్టీలను లాగడమో చేస్తాం అప్పుడు మనకి ఫెచ్చింగ్ ఉంటుందని మాత్రం భావిస్తున్నారు. అంటే సొంత బలం మీద నమ్మకం పోయింది. క్లారిటీ వచ్చేసింది. అందుకే ప్రత్యర్థుల బలహీనతల మీద పడుతున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ, ఇంతకీ బావ ఎవరంటారా ! టీడీపీలో ఉన్న నాయకుడే ! మరి ఆయన నిజామాబాద్ లో పోటీకి దిగుతాడో లేదో చూడాలి. పిచ్చాపాటీలో బైటకొచ్చిన సంగతి ఇది.

-->