బీజేపీ అసెంబ్లీలోకి ఎంటరైతే వైసీపీకే డేంజర్ ! గేమ్ ప్లాన్ ఆయన బయట పెట్టేశాడు !

చీల్చేందుకు సిద్ధం అవుతోందని, చేరికలు ఉంటాయని ఊహాగానాలు రేగుతున్న కొద్దీ వైసీపీ చప్పట్లు కొట్టి చీర్ చేస్తోంది కానీ చితకేసిది మాత్రం ఆ పార్టీనే అంటోంది బీజేపీ. అసలు మేమంటూ అసెంబ్లీలోకి ఎంటరైతే గేమ్ మరోలా ఉంటుంది. పైగా మేం తీసుకుంటున్నది హార్డ్ జగన్ వ్యతిరేకుల్నే. అందుకే మా వ్యూహం అమలు చేయడం ఈజీ – అంటూ ఆయన చెప్పిన సంగతులు చాలా చాలా స్టన్నింగ్ గా ఉన్నాయ్.అసెంబ్లీలోకి బీజేపీ ఎంటర్ అయితే పరిస్థితులు మరోలా ఉంటాయ్. ఇప్పుడు అయితే మేం గేటు బయటే ఆగిపోయాం. కానీ ముందు ముందు అలా కాదు కదా మా పార్టీలో భారీ స్థాయిలో చేరికలు ఉంటాయ్.

అప్పుడు మొత్తం రాజకీయం మారిపోతుంది. అసెంబ్లీలో జగన్ భాష బాగా లేదని, ప్రజా వేదిక కూల్చడం కరెక్టు కాదని మాట్లాడుతున్న బీజేపీ ఇప్పుడు పరోక్షంగా ఫ్యూచర్ హింట్ ఇచ్చింది. నిజానికి టీడీపీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలు చేరితే టీడీపీ ఇబ్బంది పడుతుంది అంటున్నారు. పెద్దగా ఇబ్బంది ఏముంటుంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేల్లో కొంత మంది తగ్గితే మాత్రం ఏం అవుతుంది. అదే బీజేపీ అసెంబ్లీలోకి వచ్చి రాజకీయ అజెండాకి తగ్గట్టుగా, కేంద్ర నాయకత్వం సూచనలతో ఎటాక్ చేయడం మొదలు పెడితే ఆ హీటు మామూలుగా ఉండదు. దాని వల్ల వైసీపీ వర్సెస్ బీజేపీ అవుతుందని కూడా అనుకోడానికి లేదు. ఎందుకంటే బీజేపీ మీద వైసీపీ ఎటాక్ చేయలేదు. చిలకలో ఉంది మాంత్రికుడి ప్రాణం. అదీ లెక్క.

ఇక పాత కొత్త గొడవలు ఉంటాయ్ కదా బీజేపీ అంటేనే ఇగో కదా – లాంటి ఈకలు పీకే ప్రశ్నలకి పెద్ద విలువ లేదు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎవడో నిలిచేది ఎవడో ఇప్పుడే లెక్కలు కట్టడం కూడా శుద్ధ దండగ. ఇప్పుడు మాట్లాడుతున్నది కేవలం బీజేపీ ప్లాన్ గురించి మాత్రమే. అదే నిజం కావాలని లేదు. అలాగని కాకూడదనీ లేదు. కాకపోతే వచ్చే నాలుగున్నరేళ్లు మాత్రం వాళ్లు ఆడాలనుకున్నది ఆడి తీరుతారు కదా. అదే జరిగితే అదికార పక్షానికి గుక్కు తిప్పుకోలేని పరిస్థితి వస్తుంది. అది మాత్రం నిజం.

-->