టీడీపీ నుంచి అటు పక్క జంప్ అయిన వాళ్లే టార్గెట్ ! గురిపెట్టి లాగేస్తోంది బీజేపీ !

అవును. టీడీపీ నుంచి అటు పక్కన జంప్ అయిన వాళ్లపై కచ్చితంగా గురి పెట్టింది. మొదటి విడతలో వాళ్లనే లాగేస్తోంది బీజేపీ. ఆల్రెడీ ఓ ఎమ్మెల్యే ఖరారు అయిపోయాడు బీజేపీలో చేరడానికి ! ఎందుకంటే అక్కడ ఉంటే పదవి రాదు. మంత్రి కాలేడట ! అందుకే కనీసం పనులు అయినా అవుతాయి అంటూ బీజేపీలో చేరుతున్నట్టు చెబుతున్నారు. అధికారంలో ఉన్నామన్న పేరే కానీ బీజేపీ తల్చుకుంటే అక్కడ కూడా గ్యారెంటీ ఉన్నట్టు లేదు. అవును. నిజంగానే అలాగే ఉంది సీన్. అధికారంలో ఉన్నా సరే బీజేపీ కాలు పెడితే ఇక దిక్కూ దివాణం లేనట్టే !

పవర్ లో ఉన్న పార్టీని వదిలి జంప్ అయ్యేందుకు ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఆయన డిసైడ్ అయిపోయాడు. ఆయన మహా దూకుడు. టీడీపీలో ఉన్నప్పుడు అలాగే ఉండేవాడు. వదిలి దూకేసిన తర్వాత కూడా టీడీపీ మీదకి అలాగే వచ్చేవాడు. జిల్లాలో అగ్రెస్సివ్ అనే పేరు ఉంది. ఇప్పుడు ఆయనపై బీజేపీ కన్నేసింది. ఎందుకంటే మైనింగ్ లో ఆయనకి లావాదేవీలు ఉన్నాయ్. రాష్ట్రం అవతల కూడా బిజినెస్ లు ఉన్నాయ్. బీజేపీతో ఉంటే కర్ణాటక లాంటి చోట్ల కూడా సులభంగా పనులు అయ్యే అవకాశాలు ఉంటాయ్. అందుకే, ఇక్కడ ఉంటే ఎలాగూ పదవి రాదు. అక్కడికి వెళితే వ్యాపారాలు అయినా జరుగుతాయ్. కేంద్రంలో కాస్తో కూస్తో పలుకుబడి ఉంటుంది. పైగా మనం వచ్చామన్న గుర్తింపు ఇస్తారు. అంతకంటే ఏం కావాలి ? మావోడు ఎంత సేపూ కులం లెక్కలు వేసి మమ్మల్ని ఎండగడుతున్నాడు. అయినా ఇప్పుడు గెలిచాం కానీ ముందు ముందు గ్యారెంటీ లేదు. జనంలో ట్రెండ్ మారిపోతోంది కొద్ది నెలలకే ! మందు ముందు కూడా ఇదే ఊపు కంటిన్యూ అయిపోతే కష్టం. నీకో సంగతి తెలుసా అన్నా – బీజేపీ వాళ్లు తల్చుకుంటే వదిలి పెట్టరు. ఓడించి తీరుతారు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నా అంటున్నాడు.

అవును. ఆయన నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. కరీంనగర్ లో ఒకప్పుడు ఆయన టీడీపీలో చురుకైన నాయకుడు. టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కమలం వైపు మళ్లుతున్న నాయకుడు. ఇదే జరిగితే ఇక కేసీఆర్ మీదకి బీజేపీ యమ దూకుడుగా దూకడం ఖాయం అయిపోతుంది అనిపిస్తోంది. చూడాలి మరి అదే ఖాయం అవుతుందేమో !

-->