12 రోజులు బోయపాటి కనిపించలేదా ? అందుకే సినిమా అలా వచ్చిందా ?

బోయపాటి అతి సినిమాలు తీయడం తెలుసు కానీ బ్లాక్ బస్టర్ డిజార్టర్లు తీస్తాడని మాత్రం ఇప్పుడే అర్థమైంది. రామ్ చరణ్ సినిమా తన్నేసింది. ఇలా ఎందుకైంది అంటే ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే బైటకి వస్తున్నాయ్. ఏంటి మేటర్ ? ఓసారి చూద్దాం !

రామ్ చరణ్ ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువైందా ? లేదంటే బోయపాటి లాంటి మాస్ మసాలా డైరెక్టర్ తో రంగస్థలం లాంటి హిట్ సినిమా తర్వాత తీస్తున్నామనే ఉత్సాహం కట్టుతప్పిందా ? ఈ రెండు రకాల చర్చలే సాగుతున్నాయ్ అభిమానుల్లో ! కాకపోతే ఇప్పుడు మరో యాంగిల్ బైట కొస్తోంది. అసలు బోయపాటి ఎంత వరకూ ఈ సినిమా తీశాడు ? బోయపాటి డైరెక్టర్ గా ఎంత వరకూ శాటిస్ ఫై అయ్యాడు ? షూటింగ్ షెడ్యూల్ టైట్ గా ఉన్న సమయంలో ఓ 12 రోజులు బోయపాటి ఎందుకు కనిపించలేదు ? మరి ఆ రోజుల్లో కూడా షూటింగ్ నడిచింది కదా ? మరి ఎవరు ఆ బాధ్యతలు చూశారు ? ఇదంతా ఎవరి కనుసన్నల్లో జరిగింది అనే చర్చ లేస్తోంది ! ఇంట్రెస్టింగే ! దానికితోడు, ఈ సినిమాకి అన్నీ రామ్ చరణే, ఆయనే అన్నీ చూసుకున్నాడు అని ఆడియో వేడుకలో, ఇంటర్వ్యూల్లో బోయపాటి ప్రత్యేకంగా చెప్పడాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు. రామ్ చరణే అంతా చూసుకోవడం అంటే ఇదేనా అని ఎవరికి తోచిన అర్థాలు వాళ్లు తీస్తున్నారు. నిజమేనేమో అని సినిమా తెర మీద చూస్తుంటే అనిపిస్తోంది అంటున్నారు. దమ్ము లాంటి సినిమాల్లో అతి ఉంది. అది ఎక్కువైంది. కానీ అందులో కథ ఉంది. కథనం ఉంది. ఇందులో మాత్రం అలాంటివేం లేవు. కేవలం అతి మాత్రమే ప్రతీ ఫ్రేములోనూ కనిపిస్తోంది అని ! ఇంకో సంగతి కూడా చెబుతున్నారు అభిమానులు. వినయ విధేయ రామ అనే టైటిల్ కూడా రామ్ చరణ్ పెట్టిందే అంటున్నారు. ఎందుకంటే జయ జానకీ నాయక ఆయనకి నచ్చిందట.

మొత్తానికి నాగబాబు వీడియోలతో కెలుక్కున్న సమయంలో చరణ్ సినిమా అడ్డంగా బోల్తా కొట్టింది. మరి ఇక సోషల్ మీడియాలో అలజడిని ఆపతరమా ? మామూలుగానే ఎన్నికల ముందు హీట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి. కోడి పుంజుల్లా ఇప్పుడు విరుచుకు పడతారు అందరూ ! మరి మెగా ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో ! ఇంట్రెస్టింగే !

-->