చంద్రబాబు అన్యాయం చేయడమేంటి ? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?

మద్దతు ధర గురించి మాట్లాడుతూ సీఎం చెప్పిన ఓ మాట విన్నాక చెప్పక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే రైతుకి క్లారిటీ కావాలి. ఇదేం విమర్శ కాదు. తప్పు పట్టడం అంతన్నా కాదు. సీఎం అంటే రాష్ట్రానికే పెద్ద దిక్కు. అధికారానికే కాదు బాధ్యతకూ ప్రతిరూపంగా ఉండాలి. అందుకే ఒకే ఒక్క పాయింట్ సింపుల్ విషయం చెప్పడం ! తెలంగాణలో రైతులకి మెరుగైన మద్దతు ధరలు ఉన్నాయంటూ సీఎం ఓ మాట చెప్పారు. పామాయిల్ ధరే తీసుకోండి. తెలంగాణలో ఏపీ కన్నా ఎక్కువ ఉంది. వెయ్యి రూపాయలు తేడా ఉంది. మన రైతులకి అన్యాయం జరుగుతోంది అని చెప్పారు. కానీ విషయం ఏంటంటే – మద్దతు ధర ఎప్పుడూ క్వాలిటీ ప్రాతిపదికన ఇస్తారు.

అందులో ఉన్న కాంపొనెంట్స్ ని బట్టీ లెక్క కడతారు. వ్యవసాయం అయినా, పాల కేంద్రాల్లో పాలు అయినా అంతే ! పాలల్లో వెన్న శాతాన్ని బట్టీ రేటు ఇస్తారు. అదే పామాయిల్ లాంటివి అయితే కాయల్లో నూనె శాతాన్ని బట్టీ రేటు ఇస్తారు. ఖమ్మంలో పండె పామాయిల్లో నూనె శాతం ఎక్కువ. ముందు నుంచి ఇది ఉన్నదే. ఇప్పుడే తెలిసిన బ్రేకింగ్ న్యూసేం కాదు. అందుకే అక్కడ రేటు ఎక్కువ. పక్కపక్కనే ఉన్నా ఖమ్మం గోదావరి జిల్లాలో పామాయిల్ మద్దతు ధరల్లో తేడా ఉండటానికి అసలు కారణం ఇదే. అంతెందుకు, మిర్చి చూడండి. మూడేళ్ల నాడు నల్గొండ జిల్లా నుంచి కూడా తెచ్చి మన గుంటూరులో అమ్ముకున్నారు తెలంగాణ రైతులు. అప్పట్లో ఆందోళన చేశారు మన రైతులు. ఎందుకంటే తెలంగాణలో కన్నా ఏపీ ప్రభుత్వం 1700 మద్దతు ధర ఎక్కువ ఇచ్చింది. అందుకే రోడ్ల మీద ట్రాక్టర్లను అఢ్డుకున్నారు కూడా ! కావాలంటే పేపర్ కట్టింగులు తిరగేయండి తెలుస్తుంది. ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఉండాలి. సరైన సమాచారం ఉండాలి.

లేదంటే రైతులు గందరగోళపడే అవకాశం ఉంది. వందలో 90 మంది రైతులకి ఇలాంటి విషయాలు తెలుసు. కాకపోతే మిగతా పది శాతం మంది అయినా మనం చెప్పే మాటల వల్ల కంగారు పడకూడదు. అక్కడ వచ్చే రేటు కంటే మనకి తక్కువ వస్తోందనో అన్యాయం జరుగుతోందనో అనుకోకూడదు. కడపలో స్టీలు ప్లాంటు పెట్టుకోవచ్చు, బయ్యారంలో మాత్రం వీలు కాదని కేంద్రం చెప్పడంలాంటిదే ఇది కూడా ! ఎందుకంటే బయ్యారంలో దొరికే ముడి ఇనుములో అంత క్వాలిటీ లేదట. అందుకే అక్కడ వయొబుల్ కాదు ఫ్యాక్టరీ. కొన్ని సహజ వనరులు, పంటలు ఇలాగే ఉంటాయ్. ప్రాంతాన్ని బట్టీ మారుతుంటాయ్. దీనికి ఎవరినో ప్రత్యేకంగా నిందించాల్సిన పనిలేదు.

-->