చంద్రబాబు చూడకుండానే ఎన్టీఆర్ రిలీజ్ అయ్యిందా ? చూస్తే ఆ సీన్ ఉండేది కాదా ?

ఓ సీన్ కుదిపేస్తోంది. ఓ సీన్ ఆసక్తి రేపుతోంది. పార్టీ ప్రారంభించే ముందు ఎన్టీఆర్ ని కలిసిన ఆ వ్యక్తి చుట్టూ డిబేట్ రేగుతోంది. చంద్రబాబు ప్రత్యర్థి ఆయన్ని ఎన్టీఆర్ కి పరిచయం చేసినట్టు క్రిష్ ప్రత్యేకంగా చూపించాడు. ఎందుకని ? ఇంతకీ బాబు చూశాడా ? లేదా ?

టీడీపీని దగ్గరగా చూసేవాళ్లకీ, చరిత్ర తెలిసిన వాళ్లకీ ఓ క్లారిటీ ఉంటుంది. న్యాయ కోవిదుడు జస్టిస్ చలమేశ్వర్ టీడీపీ సానుభూతి పరుడు. వ్యక్తిగతంగా ! వృత్తి పరంగా ఆయనకి రాజకీయాలు అంటే అవకాశమే లేదు. ఉంటే చరిత్ర మరో రకంగా ఉండేదేమో ! ఆయన చీఫ్ జస్టిస్ కూడా అయ్యే వారేమో తెలియదు. అయితే చంద్రబాబు పగ్గాలు అందుకున్నాక చలం బాబుతో అంటీ ముట్టనట్టుగా ఉన్నారు. చాలా కాలం విభేదించారు. హరిక్రిష్ణ వర్గంలో ఈయన ఉంటారనో, యార్లగడ్డ లాంటి వాళ్లకి సన్నిహితుడు అనో మాట్లాడతారు చాలా మంది. ఎన్టీఆర్ ఓ సన్నివేశం ఉంది. రాజకీయాల్లోకి రావాలని ఎన్టీఆర్ తీవ్ర అంతర్మథనంలో ఉన్నప్పుడు, జనం గోడు తెలిసి కదిలిపోతున్నప్పుడు ఓ యువకుడు వస్తాడు. సర్ మేం చేస్తున్నాం కదా జనం మార్పు కోరుకుంటున్నారు అని చెబుతాడు. పై పెచ్చు ఇప్పుడు కావాల్సిన ఐడియాలజీ ఏంటో తెలుసా సార్, కమ్యూనిస్టు భావజాలానికి వాస్తవ పరిస్థితుల్ని జోడించి భౌతిక వాదం ప్రాతిపదికగా వాస్తవాలతో నడిచే విధంగా పార్టీ ఉండాలి అంటాడు. ఇదిగో ఈ పుస్తకాల్లో ఆ వివరాలు ఉన్నాయ్ చూడండి అని ఇస్తాడు ఎన్టీఆర్ కి ! ఇంతకీ చలమేశ్వర్ ను ఎన్టీఆర్ కి పరిచయం చేసేది ఎవరో తెలుసా – దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అంటే క్లుప్లంగా చెప్పాలీ అంటే, ఆయన దగ్గుబాటి వర్గం కాబట్టి చంద్రబాబుతో అంటీ ముట్టనట్టు ఉన్నారేమో అనుకోవాలి నిజానికి ! అలాంటప్పుడు మరి చంద్రబాబు అడ్డు చెప్ప లేదా ? అసలు ఆ సీన్ ప్రత్యేకంగా ఎందుకు పెట్టారు అనే చర్చ లోతుపాతులు తెలిసిన అభిమాన వర్గాల్లో జరుగుతోంది గట్టిగానే !

అయితే ఇక్కడ రెండు విషయాలు క్లియర్ గా మాట్లాడుకోవాలి. చంద్రబాబు చూడకుండానే సినిమా రిలీజ్ అయ్యిందీ అంటే బాలయ్య స్వేచ్ఛగా తీసుకున్నట్టే లెక్క. అలా కాదు, బాబు చూశాకే వదిలారు ధియేటర్లలోకి అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే బాబు చూశాక కూడా ఆ సీన్ అలాగే ఉందీ అంటే బాబు నిస్పక్షపాతంగా ఉంటాడు అని కదా అర్థం. అందుకే ఈ రెండింటిలో ఏ ఒక్క దానికి టిక్కు పెట్టినా పర్లేదు !

-->