చంద్రబాబును దెబ్బ తీయడానికి మాట్లాడుతున్నా ! నువ్ తోపు అని కాదు ! బేరం ఆడుతున్న టీడీపీ ఎమ్మెల్యేకి జగన్ పంచ్

పార్టీలోకి వెళ్లక ముందే పరిస్థితి అర్థం అయిపోయింది ఆయనకి ! ఆల్రెడీ ప్రచారం గుప్పుమంటోంది. రాక తప్పదు మరో దారి లేదు అని జగన్ కూడా డిసైడ్ అయినట్టు ఉన్నాడు. అందుకే ఓపెన్ గా అనేశాడు. నువ్వు తోపు అని మాట్లాడ్డం లేదు. చంద్రబాబును దెబ్బ కొట్టడానికే నిన్ను రమ్మన్నారు మా వాళ్లు ! కండిషన్లు పెట్టి టైమ్ వేస్ట్ చేయొద్దన్నా అనేశాడు. ఇంతకీ ఆ పంచ్ తో పంక్చర్ చేసుకున్న టీడీపీ నాయకుడు ఎవరు ?

ఆయన తోపు నాయకుడు అన్నట్టు ఈ మధ్య బిల్డప్ ఇస్తున్నారు కొందరు. పార్టీ నుంచి వెళ్లిన ప్రతీవాళ్లూ ఆయన పేరు చెబుతున్నారు. అరె ఉన్న చోట దేకలేం అనో, లేదంటే చంద్రబాబు మా వైపు చూస్తాడో లేదో అనే అనుమానంతో జారుకుంటున్నామనో చెప్పుకోలేరు కదా అందుకే సామాజిక ముద్ర కోసం ఆయన పేరు వాడుతున్నారు. ఆమంచి నుంచి అవంతి వరకూ అదే వరస. ఆమంచి అయితే అర్థరాత్రి పోయి కలిసి వచ్చాడు. పైగా మేమూ మేమూ బాగా దగ్గర స్నేహితులం అని కూడా అనేశాడు. అది అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే, కాస్త ఊపు -పబ్లిసిటీ వచ్చాయి కదా దాన్ని వాడుకుందామనుకున్నాడో లేదంటే ముందు నుంచి ఆశ ఉందో కానీ ఆయన ఓ మాట బయట పెట్టాడు జగన్ దగ్గర. నాకు ఎంపీ టిక్కెట్ ఇవ్వండి. నా కొడుక్కి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వండి అని అడిగాడు. ఏం ఇవ్వాలో నువ్వు చెప్పకూడదన్నా,. మేం నిర్ణయిస్తాం. అయినా నువ్వు తోపువు అని నేను మాట్లాడ్డం లేదు. చంద్రబాబును దెబ్బ తీయడానికి మా వాళ్లు అడిగారు. అంత వరకే తీసుకో అన్నా అనేశాడు. అంటే నువ్ ఎక్కువ సీన్ చేయొచ్చు. నేను నీలాంటి వాళ్లతో ఎక్కువ మాట్లాడను అని దాని అర్థం కాబోలు. మరి ఇప్పటికే ముద్ర పడిపోయింది కాబట్టి మూసుకొని ఫ్యాన్ కింద కూర్చుంటాడో, లేదంటే ఆగుతాడో చూడాలి. ఇది గోదావరి జిల్లా ఇంట్రెస్టింగ్ ఇప్పుడు.

ఇంత చెప్పిన తర్వాత స్పష్టత కోసం మరో విషయం కూడా చెప్పాలి. జగన్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందో చెప్పడానికి మాత్రమే ఇదంతా ! టీడీపీ నుంచి ఇప్పటికే వెళ్లిన వాళ్లు పైకి చెప్పుకోవడం లేదు. ఈయన మాత్రం నేరుగా చెప్పేశాడు. అదేంట్రా అలా అన్నాడు అని ఆశ్చర్యంతో కూడిన షాక్ తో !

-->