చంద్రబాబు ఢిల్లీ టూర్ ఎఫెక్ట్ తో తెలంగాణలో వార్ వన్ సైడ్! టీవీ ముందే కేసీఆర్ !

కటౌట్ ని బట్టీ కదలిక ఉంటది. స్టామినాను బట్టీ రియాక్షన్ ఉంటది. కేసీఆర్ రెండ్రోజులు ఢిల్లీలో ఉన్నాడన్న సంగతి ఆయనకి ఆయన పీకేకి తప్ప పక్కనున్న ఏపీకి కూడా తెలియదు. అదే చంద్రబాబు ఢిల్లీ వెళ్లే సరికి మాత్రం దేశం మొత్తం చూస్తోంది. ఏం జరగబోతోంది అంటూ టీవీలకి అతుక్కుపోయింది. వాళ్లూ వీళ్లే కాదు కేసీఆర్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఏంటి చంద్రబాబు టూర్ తో ఢిల్లీలోనే కాదు తెలంగాణలో కూడా బొమ్మ తిరగబడుతోందా ?

కచ్చితంగా పడుతోంది. అందుకే చంద్రబాబు అంత హడావుడిగా, వారంలో రెండోసారి ఢిల్లీ వెళ్లాడు. నాకు పోటీ లేదు, నాకు ఎదురు లేదేని నియంత మోడీ చెలరేగిపోతున్నాడు. ఇలాంటి సమయంలో చంద్రబాబు దెబ్బకొట్టేశాడు. మోడీ గర్వం మీద కొట్టేశాడు. నేనున్నా అని చెప్పేశాడు. చెప్పడమే కాదు పార్టీలను ఒక వేదిక మీదకు తీసుకొచ్చాడు. అవసరం అయితే ఆ మూడు రాష్ట్రాల్లోనే కాదు తెలంగాణలో కూడా మిత్ర పక్షాలతో ఉమ్మడిగా సభలు పెడతా అంటున్నాడు. అదే జరిగితే కేసీఆర్ మటాష్ అయిపోతాడు రాజకీయంగా ! ఎందుకంటే మొన్నటి వరకూ తెలంగాణలో టీఆర్ఎస్ ది ఎడ్జ్. నిన్న పోటాపోటీ. ఇవాళ కాంగ్రెస్ కూటమి ముందు ఉంది. ఎందుకంటే టీడీపీ కలిసింది. చంద్రబాబు వచ్చాడు. ప్రచారానికి కూడా దిగుతాడు. ఇలాంటి సమయంలో చంద్రబాబు కనుక ఢిల్లీ స్థాయి కూటమిని దించితే ఇక మామూలుగా ఉండదు. పార పలుగుతో టీఆర్ఎస్ తవ్వుతుంటే చంద్రబాబు ప్రొక్లైన్ వేసుకొని రంగంలోకి వచ్చినట్టే ఉంటుంది. కేసీఆర్ పోటీ పడలేదు. ఇప్పటి వరకూ తెలంగాణలో పది ఓట్లు ఉంటే మూడు టీఆర్ ఎస్ కి. మూడు కాంగ్రెస్ కూటమికి ఉన్నాయ్. ఒకటి పడదు. మరొకటి మిగతా వాళ్లకి అనుకుంటే ఇక రెండు బ్యాలెన్స్. చంద్రబాబు కనుక జాతీయ పరివారంతో వచ్చాడంటే ఆ న్యూట్రల్ ఓట్లు రెండూ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోతాయ్. ఎందుకంటే అవి కేసీఆర్ కి మోడీకి వ్యతిరేకం. అందుకే న్యూట్రల్. ఆ న్యూట్రల్ కాంగ్రెస్ వైపునకు వెళ్లిపోతే కాంగ్రెస్ కి ఐదు, టీఆర్ఎస్ కి మూడు అవుతాయ్.

అందుకే కేసీఆర్ కి భయం పట్టుకుంది. చంద్రబాబు ప్రభావం ఎంతో టీఆర్ఎస్ లో బుర్రతక్కువ నాయకులకి అర్థం కాకపోవచ్చు కానీ ఇద్దరికి మాత్రం క్లియర్. తెలంగాణలో క్లారిటీ ఉన్నది వాళ్లకే. అందులో ఒకరు ప్రజలు అయితే రెండు కేసీఆరే ! జనానికి తెలుసు, చంద్రబాబు బలం అనే విషయం కూడా కేసీఆర్ కి అర్థం అయ్యింది ఎప్పుడో ! అందుకే ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ప్రగతి భవన్ లో టీవీల ముందే ఉన్నాడు.

-->