ఏపీ రాజకీయాలపై కశ్మీర్ ఎటాక్ ప్రభావం ఉంటుందా ? చంద్రబాబు ఏం చేస్తాడు ?

పంచంలో మొత్తం ఏడు కథలే ఉంటాయ్. పాత్రలు మార్చి, తిప్పి తిప్పి అవే రాస్తారు అని చెబుతుంటారు సినిమా వాళ్లు ! రాజకీయాల్లో సక్సెస్ ఫుల్ ఫార్ములాలు కూడా అంతే ! చంద్రబాబు చూడండి, జగన్ ని సత్రకాయ్ చేసేది మోడీని కొడుతుంటాడు. ఇప్పుడు మోడీ కూడా ఇదే ఫార్ములా ఎత్తుకుంటాడా ? కశ్మీర్ ఎటాక్ తర్వాత, రాహుల్ గురించి మాట్లాడ్డం మానేసి పాకిస్థాన్ ను తిడుతూ ఎన్నికలు వెళతాడా ? వెళితే ఎలా ఉంటుంది ప్రభావం ? చంద్రబాబు వ్యూహం మార్చుకోవాలా ?

వ్యూహం మార్చకపోతే ఏమవుతుందో ముందే చెప్పేద్దాం. తర్వాత ఎందుకు మార్చాలో ఈజీగా అర్థం అవుతుంది. మోడీ ఆల్రెడీ మొదలు పెట్టేశాడు. సభల్లో తిడుతున్నాడు. పాకిస్థాన్ అడుక్కుతినే దేశం. ఆ దేశాన్ని వదిలిపెట్టబోం అంటున్నాడు. చప్పట్లు మోగుతున్నాయ్. ఇలాంటప్పుడు విపక్షాలు అన్నీ ఏకంగా కూర్చొని, మీటింగులు పెట్టి, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గ్రూపు ఫోటోలు దిగితే ఇబ్బందికరమే ! ఎందుకంటే మోడీ పాకిస్థాన్ మీద యుద్ధం చేస్తుంటే, మోడీ మీద వీళ్లంతా యుద్ధం చేస్తున్నారు అని బీజేపీ వ్యూహ బృందం ముద్ర వేయడానికి అవకాశం తేలిగ్గా దొరుకుతుంది. అందుకే వ్యూహం మార్చాలి. తర్వాత ఇక్కడ కూడా మోడీని చంద్రబాబు టార్గెట్ చేయడం సరే. ఇక ముందు కూడా అది మాత్రమే చేయడం తగ్గించి, జగన్ వైఫల్యాల్నీ, గ్రౌండ్ లెవెల్లో చేతగాని తనాన్ని ఎక్స్ పోజ్ చేస్తూనే తానే మళ్లీ ఎందుకు అవసరం ? ఏపీ ఇప్పుడు ఏ దశలో ఉంది ? అన్నం ఉడుకుతోంది – కూర తరిగి పెట్టుకున్నాం – ఇలాంటి సమయంలో మన భోజనానికి మనమే ఆటంకం పెట్టుకోకూడదు అనే విషయాన్ని అర్థం అయ్యేలా చెప్పాలి. అంటే అమరావతి పునాదులూ, పోలవరం నిర్మాణాలు, ప్రాజెక్టులు, వచ్చే ఐదేళ్లలో ఏపీ ఎలా మారబోతోందో చెప్పడం లాంటివి ఉండాలి. ఇలాంటి మార్పు ఇప్పుడు అవసరం కచ్చితంగా ! లేకపోతే రాజకీయంగా క్లిష్ట పరిస్థితులు ఉంటాయ్.

ఇవన్నీ కాదు. చంద్రబాబు ఎటాకింగ్ మోడ్ లోనే ఉండాలి మోడీ విషయం అనే వాళ్లు కూడా ఉన్నారు. ఎందుకంటే నేషనల్ ఇష్యూల ప్రభావం ఉత్తరాదిలో ఉన్నంతగా దక్షిణాదిలో కనిపించదు సహజంగానే ! పొడుచుకొచ్చినా ఇది నిజం. ఇలాంటప్పుడు ఏపీ ఫ్యాక్టర్ తో దూకుడైన ఎటాక్ తో వెళితే డెఫినెట్ గా రిజల్ట్ కనిపిస్తుంది. దేశమంతా కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ ఏపీలో గెలిచి ప్రధాన ప్రతిపక్షం అయినట్టుగా హిస్టరీ రిపీట్ చేసే ఛాన్సుంది ! ఒక చిన్న క్లారిటీ. దీనర్థం మళ్లీ మోడీ గెలుస్తాడని మాత్రం కాదు సుమా ! పెట్టుడు సెంటిమెంట్ల ప్రభావం ఏపీలో ఉండదు అని మాత్రమే !

-->