వర్మకి చెప్పు తెగే రేంజిలో సమాధానం ! చంద్రబాబు ఏంటో ఆ ఒక్క డైలాగ్ తో చెప్పాడు బాలక్రిష్ణ !

నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. నేను మీ గడపలకి పసుపునై బతకడానికి వచ్చా – వాహ్, వాట్ ఎ డైలాగ్ ! మహా నాయకుడిలో మకుటం ఇదే ! చంద్రబాబును బాలయ్య ఎలా చూపించబోతున్నాడు, అసలు ఏం జరిగిందో కూడా చెబుతాడా అనే సందేహాలకి కూడా సమాధానం దొరికేసింది. ఆ ఒక్క డైలాగే చెప్పింది విషయం ఏంటో !

ఆరు కోట్ల మంది ఆయనతో ఉన్నా, అసలు ఏం జరుగుతోందో చెప్పేవాళ్లు కూడా ఆయనకి కావాలి, లేకపోతే ఒంటరి వాడు అయిపోతాడు – చంద్రబాబు డైలాగ్ ఇది. మహా నాయకుడు సినిమాలో రానా చెప్పిన నారా డైలాగ్ ఇది. అదిరిపోయింది. అసలు ఏం జరిగింది ? ఎన్టీఆర్ జీవితంలో ఎలాంటి మిట్టపల్లాలు చూశారు లాంటివన్నీ ఇందులో కనిపించడం ఆసక్తి రేపుతోంది. ఎన్టీఆర్ రాకే ఓ ప్రభంజనం వచ్చాడు. గెలిచాడు. తర్వాత భార్య ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లాడు. అదే అదునుగా నాదెండ్ల దెబ్బ తీశాడు. ఆయనపైకి ఎగదోశాడు. గ్లామర్ ఆయన గ్రామర్ నేను అంటూ చెప్పిన డైలాగులు కూడా ఉన్నాయ్. ఇందిర ఎలా ఉన్నారు ? ఏం చేశారు అనేది కూడా ఇందులో కనిపిస్తోంది.

ఇందిర ఓ సందర్భంలో కర్నూలు ప్రచారానికి వచ్చినపుడు జనంతో ప్రాంతం అంతా కిటకిటలాడటం. తీరా ఎన్టీఆర్ సభ కూడా ఉండే సరికి ఈమె సభ నుంచి ఆయనను చూడటానికి జనం వెళ్లిపోవడం – ఆమె ఆశ్చర్యపోవడం లాంటి వాస్తవ సన్నివేశాలు ఇందులో ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. రాష్ట్రాలతో కూడినదే దేశం లాంటి డైలాగులు ఇప్పటి రాజకీయానికి కూడా వర్తించేలా ఉన్నాయ్. మొత్తానికి ఇటు జనానికి తెలిసేలా, ఎన్టీఆర్ అంటే ఏంటో అర్థం అయ్యేలా బాలయ్య రెడీ అయినట్టు ఉన్నాడు. కాదు కాదు మహానాయకుడు రెడీ అయ్యాడు.

-->