చంద్రబాబు కోసం ధోనీ వస్తున్నాడు ! ప్రకటన చేయబోతున్నాడు !

లీడర్ ఆకర్షణ అయస్కాంతం లాంటిది ! లీడర్ తన పనిలో తాను ఉంటే, ఆకర్షణ అందరినీ దగ్గర చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు కోసం ధోని రావడం చూస్తే ఇలాగే అనిపిస్తోంది. అల్రెడీ ఫిక్స్ అయ్యాడు. త్వరలో ప్రకటన కూడా చేయబోతున్నాడు.

ఎందుకంటే ప్రత్యేకమైన ఇంప్రెషన్ ఉందని చెబుతున్నాడు. లవ్వు అంటున్నాడు. చంద్రబాబు ఓ పక్కన ఎన్నికల హడావుడిలో తల మునకలై ఉంటే, బాబు చేస్తున్న పనులు, ఏపీ విధానాలూ అన్ని ఎట్రాక్ట్ చేస్తున్నాయ్ ప్రపంచాన్ని ‍! మహేంద్ర సింగ్ ధోనీ కూడా దిగుతున్నది అందుకే ‍! ఎక్కడ దిగుతున్నాడు ఇంతకీ? విశాఖలో ‍! ధోనీ పెట్టుబడులు పెట్టబోతున్నాడు. క్రికెట్ అకాడమీతో పాటు టెన్ ప్లస్ టు రేంజిలో ఓ ఇంటర్నేషనల్ స్కూలు పెట్టబోతున్నాడు. ఆల్రెడీ పర్మిషన్లకి అప్లై చేసుకున్నాడు. అది క్లియర్ కావడానికి కూడా ఇక ఎలాంటి ఇబ్బందీ లేదు. విశాఖ చూసి ముచ్చట పడ్డాడని, ముందు నుంచి నగరం అంటే ఎంతో ఇష్టమనీ చెబుతాడు ధోనీ. హుదూద్ లాంటి విలయం కొట్ట, తుడిచి పెట్టిన తర్వాత కూడా విశాఖ నిలబడిన తీరు చూస్తే ఆశ్చర్యం కాదు గర్వంగా ఉంటుంది అంటాడు ధోనీ. అలా నిలబడటం వెనకఓ స్పిరిట్ ఉందని, పని చేయాలన్న కసి, గెలవాలన్న పట్టుదల ఉన్నాయని చెబుతాడు. అందుకే విశాఖ అంటే గౌరవం మరింత పెరిగిందని, ఇంక క్లీనెస్ట్ సిటీ డెవలప్ మెంట్ లో భాగస్వామ్యం కావడం అరుదైన గౌరవం అంటూ మురిసిపోతున్నాడు కూడా ‍! అందుకే ప్రత్యేకంగా చెబుతున్నది. ఇక్కడ నాయకత్వం, పరిస్థితులు అన్నీ ప్రొగ్రెస్సివ్ గా ఉన్నాయ్ అంటాడు ధోనీ.

ఓ రాష్ట్రం విడిపోయాక నిలబడటం కోసం ఎంత కష్టపడుతుందో తనకి తెలుసు అని ధోని అంటాడు. ఎందుకంటే తనకి ఊహ తెలిసిన తర్వాత తన రాష్ట్రం కూడా విడిపోయిందని, వెనకబాటు ముద్రను పోగొట్టుకునేందుకు ఇప్పటికీ తిప్పలు పడుతోందని జార్ఖండ్ ను ప్రస్తావిస్తాడు. కానీ ఏపీ అలా కాదు. పడినంత వేగంగా లేచి నిలబడుతూ కెరటానికి ఉన్న స్ఫూర్తి తనకీ ఉందని చూపుతోంది. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకాన్ని పెంచుతోంది. అందుకే ధోనీ వస్తున్నాడు.

-->