చంద్రబాబుకి అఖిల ప్రియ సర్టిఫికెట్ ? ఏం చెప్పాలనుకుంది అసలు ?

ఆమె జనసేనలోకి వెళ్లిపోతోందని ఖాయంగా చెబుతున్నారు కర్నూలు వాళ్లు. ఆమె కావాలనే గొడవలు పెట్టుకుంటోందని, రాజప్ప కూడా మంచీ చెడ్డా మాట్లాడారని కూడా అంటున్నారు. ఇలాంటి సమయంలో అఖిల ప్రియ నుంచి క్లారిటీ స్టేట్ మెంట్ లాంటిది ఒకటి వచ్చింది. పనిలో పనిగా ఆమె చంద్రబాబుకి సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పదల్చుకున్నదామె ?

ఏంటి ? అఖిల ప్రియ గతం నుంచి నేర్చుకోలేదా ? శోభానాగిరెడ్డి ఇలాగే హడావుడిగా ప్రజారాజ్యంలో చేరి దెబ్బతిన్నది. అటు తర్వాత వైసీపీలోకి వెళ్లింది. జగన్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చింది లాంటి మాటలు చెబుతారు దగ్గర నుంచి చూసిన వాళ్లు. ఇప్పుడేమో ఆమె మళ్లీ అటు వైపే చూస్తున్నారన్న టాక్ వస్తోందని ఆశ్చర్యపోయారు సగటు టీడీపీ అభిమానులు. ఆమె చెబుతున్నది మాత్రం మరోలా ఉంది. చంద్రబాబు తనకి అన్ని విధాలా అండగా ఉన్నారని, తండ్రిలా చూసుకుంటున్నారని అఖిల ప్రియ చెబుతోంది. నియోజక వర్గానికి కూడా అడిగినన్ని నిధులు ఇస్తున్న చంద్రబాబు నాయుడు దేవుడు అంటోంది అఖిల ప్రియ. తనకి ఏ లోటూ రాకుండా చూసుకున్నారని, అలాంటి నాయకుణ్ని – పార్టీ వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముందని ఆమె అడుగుతోంది. తన మీద కావాలనే దుష్ర్పచారం చేస్తున్నారని, అసలు పార్టీ వీడే ఉద్దేశమే లేదని అఖిల ప్రియ చెబుతోంది. నిజానికి అఖిల పార్టీ మారుతుందన్న ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది. ఇన్నాళ్లూ ఆమె వైపు నుంచి అసలు రియాక్షన్ కూడా లేదు. పై పెచ్చు, సీఎం కార్యక్రమం జిల్లాలో ఉన్నా, మంత్రిగా ఆమె కనీసం రెస్పాండ్ కాలేదన్న వాదన వినిపిస్తున్నారు పార్టీ వాళ్లు. ఇలాంటి సమయంలో అఖిల రియాక్షన్ ఆసక్తి రేపుతోంది. మరి ఇప్పుడే ఆమె ఎందుకు స్పందించిందో చూడాలి.

ఇక చంద్రబాబుకి సర్టిఫికెట్ ఇవ్వడం గురించి అంటారా ? చంద్రబాబు ఏం చేశాడు, మాట మీద ఎలా నిలబడ్డాడో నంద్యాలనే కాదు కర్నూలు జిల్లా మొత్తం చూసింది. అఖిలను ఆయన ఆదుకున్న తీరు రాష్ట్ర వ్యాప్తంగా కదలిక తెచ్చింది. మరి ఇప్పుడు ఆమె ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఆమె నేరుగా సీఎం గురించి మాత్రమే పాజిటివ్ గా మాట్లాడ్డం చూస్తుంటే – ఎవరిపైనో గురి పెట్టి, వారి మూలాన నేను ఇబ్బంది పడుతున్నా అనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. వాటం !

-->