చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని 3 కోట్లకి అమ్మేశాడు ! ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా ?

అన్ని ఏడుపులూ ఒకేలా ఉండవ్ ! అన్ని కన్నీళ్లూ కదిలించలేవు కూడా ! అందుకే అతను నెత్తీనోరూ కొట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి ప్రత్యర్థి శిబిరంలో ఓదార్పు పొందుతున్నాడు కానీ పెద్దగా లాభం లేదు. ఎందుకంటే చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని అతను 3 కోట్లకి అమ్ముకున్నాడు ! అందుకే పారచూట్ లేకుండా విమానం లోంచి దూకినట్టు అయిపోయింది భవిష్యత్ !

చంద్రబాబు నిలువునా నమ్ముతాడు. కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటే ఎవ్వరేం చెప్పినా వినడు. నిలబడతాడు. అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చాడు కదా అని లైట్ గా తీసుకుంటే చరిత్ర ఇలాగే చిరిగిపోద్ది. సైలెంట్ గా కూల్ గా కామ్ గా కనిపించే బాబులో ఇంత కఠిన మైన కోణం ఉందా అంటే ఉంది. పైగా ఇది కఠినత్వం కాదు. వాస్తవం. ఇంత పెద్ద పార్టీని నడుపుతున్నప్పుడు, రెండు రాష్ట్రాల్లో వ్యవహారాలు నెరపుతున్నప్పుడు కొన్ని సార్లు తప్పదు. అందుకే అతను ఏడిచి గీ పెట్టినా పెద్దగా రెస్పాండ్ కాలేదు. బాబు ఎందుకు మాట్లాడ్డం లేదో తెలుసు కాబట్టి అటు కాంగ్రెస్ కూడా సైలెంట్ గా ఉండిపోయింది. పైపెచ్చు గత ఎన్నికల్లో బాబు ఇచ్చిన టిక్కెట్ ను అతను అమ్ముకున్నది కాంగ్రెస్ లో కీలక నాయకుడి భార్యకే ! ఆమెకి సహకరించేందుకు, ప్రచారం చేయను, మీ గెలుపు కోసం ప్రయత్నిస్తా అని చెప్పినందుకు 3 కోట్లు తీసుకున్నాడు. అంటే టీడీపీ కూడు తిని కాంగ్రెస్ కోసం పనిచేశాడు. అప్పుడే తెలుసు ఆ విషయం. చంద్రబాబు ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు అంతే ! అందుకే గగ్గోలు పెట్టాడు. తానో నిజాయితీ పరుణ్ని అని చెప్పాడు. అలా ఎలా కుదురుతుంది ? కొనుక్కున్నోడు ఇప్పుడు టీడీపీతో కలిసిశాడాయె. మరి అలాంటప్పుడు ఎవరు నమ్ముతారు ?

ఇలాంటి పరిస్థితుల కోసం టీఆర్ఎస్ కాసుక్కూర్చొంది కదా ! పైగా అడుగుబొడుగూ దొరికితే వేసుకుపోదామని ఆయన ఎదురు చూస్తున్నాడు ఎప్పటి నుంచో ! అందుకే వెంటనే పార్టీలోకి తీసుకున్నాడు. తీసుకుంటే మాత్రం ఏం లాభం ? టీఆర్ఎస్ జాతకం, కేసీఆర్ భవిష్యత్ అన్నీ తేలిపోయాక ఇలాంటోళ్లు ఏం చేస్తారు ! అన్నట్టు ఓ చిన్న క్లూ ! ఇదంతా నల్గొండ స్టోరీ !

-->