ఆంధ్రా నుంచే తెలంగాణ ఎన్నికల ప్రచారం.. చంద్రబాబు స్ట్రాటజీ అదిరింది !

కేసీఆర్ అడ్డగోలుగా పేలాడు. దరిద్రం, దబిడి దిబిడి అని నోరుపారేసుకున్నాడు. చంద్రబాబు మాత్రం సైలెంట్ గా టీఆర్ఎస్ పతనానికి చితి పేర్చేశాడు. ప్రకాశంలో మీటింగ్ చూశాక పూర్తి క్లారిటీ వచ్చేసింది. కేసీఆర్ నరం దొరికేసింది చంద్రబాబుకి. ఇక మెలి పెట్టడమే మిగిలింది. ఎలా పెడతాడో తెలుసా ?

కేసీఆర్ నరం పట్టేశాడు చంద్రబాబు. ఇక మెలి పెట్టడమే మిగిలింది. చంద్రబాబును తిట్టాలా ? వద్దా ? చంద్రబాబును తిడితే ఆంధ్రా ఓట్లు మైనస్ అవుతాయా ? లేదంటే తెలంగాణలో కలిసొస్తుందా ? చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేయాలా ? లేదంటే కాంగ్రెస్ ను కూడా కలిపి కొట్టాలా ? ఏం చేస్తే ఏమవుతుంది అనేది తేల్చుకోలేకపోతున్నాడు కేసీఆర్. అందుకే ప్రచారానికి కూడా బ్రేక్ తీసుకున్నాడు. ఇక బయటకి వచ్చేది దీపావళి తర్వాతే ! ఎందుకు అంత గందరగోళం అంటే, చంద్రబాబును శని దరిద్రం అని తిట్టిన తర్వాత కనీసం 20 సీట్లలో అడ్వాంటేజ్ పోయిందని సొంత సర్వే తేల్చింది. ఆ విషయం స్వయంగా కేసీఆరే చెప్పాడు. మరో పక్కన బాబు దూకుడు పెంచాడు. కాంగ్రెస్ తో కలిశాడు. కేసీఆర్ పైనా స్పీడు పెరిగింది. హైద్రాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేసి ఇస్తే పరిపాలించడం చేతగాలేదు మీకు అనడంలో ఉద్దేశం అదే. అంటే ముందస్తుకి వెళ్లిపోయావు నీ వల్ల కాక అని చేశాడు ఎటాక్ చంద్రబాబు.

ఇలాంటి విమర్శలపై టీఆర్ఎస్ లాక్కోలేదు. పీక్కోలేదు. ఎందుకంటే కేటీఆర్ కూడా గతంలో ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు వల్లే హైద్రాబాద్ కి సాఫ్టువేర్ గుర్తింపు వచ్చింది అని. దానికి తోడు చంద్రబాబుని ఏం అన్నా, తిట్టినా ఆంధ్రాను తిట్టినట్టే అనే ఫీలింగ్ బలంగా వెళ్లిపోయింది జనంలోకి. అందుకే ఎలా కౌంటర్ చేయాలో తెలియడం లేదు. ఇదే అదునుగా ఇక రోజూ తెలంగాణ ఎన్నికల ప్రస్తావన తెస్తా అంటున్నాడు. అందుకే అంటున్నది ఏపీ నుంచే తెలంగాణ ఎన్నికల ప్రచారం. బాబు వ్యూహం అదిరింది. ఇక తిరుగులేదు కాస్కోండి.

-->