చేర్చుకున్నోళ్లని ఎలా వాడుకుంటున్నాడో చూడండి ! జగన్ ఫ్యూచర్ మీద క్లారిటీ వచ్చేస్తది !

ద సీఎం ఇన్ వెయిటింగ్ నీడ్స్ టు హోల్డ్ హిజ్ హార్సెస్ ఫర్ మోర్ లాంగర్ అనాలేమో ! సరిపోదు. ఈ ప్లానింగ్ ఏ మాత్రం సరిపోదు అని మీరే చెబుతారు. ఎందుకంటే, అడుగూ బొడుగును ఒక గొడుగు కిందకు తీసుకొస్తున్న జగన్ – కాస్తో కూస్తో తన పార్టీకి ఊపిరి వస్తుందని ఆశ పడుతున్నాడు. ఈ మధ్య వరస కట్టి చేరిన వాళ్లలో కొందరికి సీట్లు కూడా కేటాయించాడు. అవి చూస్తే ఆనంద పుష్పాలు ఆటోమేటిగ్గా వచ్చేస్తాయ్ !

హనీ ఈజ్ ద బెస్ట్ అని అదేదో సినిమాలో మందపాంటి ఆవిడెవరో చెప్పుకున్నట్టు, నేనే బెస్ట్ అంటున్నాడు రవీంద్ర బాబు. చేరాడు వైసీపీలో ! ఏదో ఊడబొడుస్తాడు అనుకుంటే రవీంద్రను తీసుకెళ్లి పాయకారావు పేట ఇచ్చాడు. లబోదిబోమంటూ అదెక్కడుందో గూగుల్ మ్యాప్ పెట్టి వెదుక్కోవాల్సిన సీన్ ఇప్పుడు. టీడీపీ అనితకి ఇది గుడ్ న్యూసే ! రవీంద్ర ఎప్పటికి పాయకా రాపు పేట చేరుకోవాలి. చచ్చి పోయిన వైసీపీని ఎప్పటికి బతికించాలి ? అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పడం ఎందుకో తెలుసా ? జగన్ పార్టీ నిండా కంతలే ఉన్నాయ్. అవి పూడ్చుకునేందుకు జీవితకాలం పడుతుంది. ఎక్కడెక్కడి నుంచో తీసుకున్న నేతల్ని ఇప్పుడు ఇష్టారీతిన సర్దుబాటు చేస్తున్నాడు. నాకు సుఖం లేదు. నీకు శాంతి లేదు అన్నట్టు అయిపోయింది సినిమా ! వీళ్లకి మనసొప్పదు. కానీ వెళ్లక తప్పదు. వెళ్లిన తర్వాత అక్కడ కేడర్ ఉండదు. ఉన్న ఒకరిద్దరు కూడా వీళ్లని దేకరు. అలాంటప్పుడు చేరికలతో ఒరిగేదేముంది ? బూడిద తీసుకెళ్లి గాడిదకు రాచినట్టే ! దానికీ వీళ్లకీ ఇద్దరికీ లాభం లేదు.

ఇక చివరాఖరికి ఇది కూడా చెప్పాలిగా ! జగన్ ను సీఎం ఇన్ వెయిటింగ్ అనడం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ వాస్తవం. నిజం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జగన్ సీఎం ఇన్ వెయిటింగే ! ఇప్పుడే కాదు. ఎప్పటికీ ! ఏం చేసుకుంటారో చేసుకోండి మీ ఇష్టం !

-->