వ్యూహ కర్త వచ్చేశాడు ! మొదటి సమస్య తీర్చేశాడు ! చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ కొత్త స్కెచ్

కేసీఆర్ ఎత్తుగడలు వేస్తాడు. టీఆర్ఎస్ ఎంతైనా ఖర్చు పెడుతుంది. ఎంఐఎం లాంటి పార్టీలు తెర వెనక లాలూచీ పడతాయ్. ఈ కాంగ్రెస్సోళ్లు చూస్తేనేమో తన్నుకు చస్తారు తప్పితే, ఛస్తే కలవరు అని కంగారు పడుతున్న వాళ్లకి శుభవార్త. ఆయనొచ్చేశాడు. ట్రబుల్ షూటర్ దిగిపోయాడు. కాంగ్రెస్ కి ఓ ప్రొబ్లం ఫిక్స్ చేసేశాడు. తీర్చేశాడు. ఇక ఎటాకింగ్ మోడ్ లోకి వెళుతుంది కూటమి అంటున్నారు. ఇంతకీ ఎవరాయన ? ఏం చేశాడు ఫిక్స్ ?

కాంగ్రెస్ లో ఎవరికి వాళ్లే దేశ్ కీ నేత. టిక్కెట్ వస్తే అమ్మ అంటారు. టిక్కెట్ దక్కకపోతే ఎవడినైనా నీ యెబ్బ అని తిరగబడతారు. ఇలాంటి వాళ్లనే పట్టుకొని టీఆర్ఎస్ యాపారం చేస్తోంది. ఆల్రెడీ తిరగబడ్డారు. ఆఖరికి ఇంట్లో ఓ టిక్కెట్ దక్కినా సబిత కొడుకు లాంటి వాళ్లు కాలు దువ్వారు. ఆయన వచ్చారు. సెట్ చేసేశాడు. అవును. కర్ణాటక మంత్రి శివకుమార్ గురించే. శివకుమార్ ముందు నుంచి ట్రబుల్ షూటర్. దాదాపు 20 ఏళ్ల అనుభవం ఇలాంటి వ్యవహారాల్లో. మొన్నటికి మొన్న కర్ణాటకలో పూర్తి మెజారిటీ రాక బీజేపీ సంతలో సరుకుల్లా ఎమ్మెల్యేను కొనబోతే అడ్డుపడింది శివకుమారే. స్కెచ్ చంద్రబాబుది అయినా ఇంప్లిమెంట్ చేసింది శివకుమారే. ఇప్పుడు కూడా అదే కాంబినేషన్ వర్కవుట్ కాబోతోంది. అందుకే ప్రత్యేకంగా చెబుతున్నది. శివకుమార్ వచ్చాడంటే ఇక సెట్ అయినట్టే. ఆల్రెడీ రాజేంద్ర నగర్ పంచాయతీ సెట్ చేశాడు. కార్తీక్ గాడిలో పడ్డాడు. గణేశ్ గుప్తాతో వెళ్లి మరీ నామినేషన్ సంబరం చేశాడు. ఇలాగే ఉండబోతోంది ఎఫెక్ట్. కూటమికి అడ్వాంటేజ్ ఎక్కడెక్కడ ఉందో లెక్క తీయడం, పోటా పోటీ ఉన్న చోట వ్యూహ రచన చేయడం, పోరాడినా లాభం లేని చోట ఏం చేయాలో చెప్పడం శివకుమార్ బాధ్యత. ఉన్న ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా తెలివిగా యుద్ధం చేద్దాం. ప్రత్యర్థి బలవంతుడు కాదు… డబ్బులు మాత్రమే పెడతాడు. మనం బుద్ధి బలంతో కొడతాం అని చెబుతున్నాడు ఆల్రెడీ.

అయితే ఇప్పుడు ఇదో పవర్ ఫుల్ కాంబినేషన్. చంద్రబాబు సలహాలు చెబుతాడు. వ్యూహ రచన చేస్తాడు. శివ కుమార్ ఇంప్లిమెంట్ చేస్తాడు. దారి తప్పే కాంగ్రెస్ ని గాడిలో పెడతాడు. అంతా తానై చూసుకుంటాడు. అందుకే శివకుమార్ రాకతో కాంగ్రెస్ కి ఓ లోటు తీరిపోయింది. వ్యూహ కర్త వచ్చేశాడు. ఇక టీఆర్ఎస్ కి చెక్ పడటం మొదలైనట్టే !

-->