వైసీపీలో సాయంత్రం మరో చేరిక – సాయిరెడ్డి లైనప్ ఇదే ! ఇది దగ్గుబాటి కోటా !

ఇలాంటివి చూస్తే సగటు టీడీపీ అభిమాని ఎమోషనల్ అయిపోయి, చేతులు నలుపుకొని రగిలిపోయే సందర్భం. కానీ అంత సీన్ అవసరం లేదు. టీడీపీలో టిక్కెట్లు రావని తేలిపోయిన, కేవలం స్టాండ్ బైకి మాత్రమే పరిమితం అయిన వాళ్లని వరస బెట్టి బండి ఎక్కించి తీసుకుపోతోంది జగన్ పార్టీ. సాయి రెడ్డి తనదైన మోడల్లో రోజుకో చేరిక ఉండేలా, మీడియాలో కవరేజ్ వచ్చేలా జాగ్రత్త పడుతున్నాడు. అంతే ! ఇది దగ్గుబాటి కోటా !

దగ్గుబాటి దంపతులు టీడీపీలోకి రావాలని ఎదురు చూసీ చూసీ ఇక తప్పని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకొని వెళ్లిపోయారు వైసీపీకి ! ఇది రివేంజ్ టైమ్ వాళ్లకి ! తమ సన్నిహితుల్ని, రాజకీయ బంధువుల్ని, చుట్టాలను, పక్కాలను అందరినీ వైసీపీలో చేర్చేస్తున్నారు వరస బెట్టి ! ఇఫ్పుడు విజయ ఎలక్ట్రికల్స్ ఆయన వంతు వచ్చింది అంటున్నారు. అవును. దాసరి జై రమేశే ! సాయంత్రం ప్రత్యేకంగా జగన్ తో సమావేశం అవుతారట. వైసీపీలో చేరడం ఖరారు అయిపోయింది. విజయవాడ ఎంపీగా ఆయన పోటీ చేసేది కూడా ఖాయం అంటున్నారు. సామాజిక ఈక్వేషన్ తోపాటు టీడీపీలో కూడా చీలిక వచ్చి ఓట్లు తమకి పడతాయని ఆశ పడుతున్నాడు జగన్. అందుకే దాసరిని బరిలో దింపుతున్నాడు.

ఎప్పుడో తెలిసిన విషయమే కదా ఇది అని తేలిగ్గా తీసుకోకండి. అందుకే ముందరే ప్రత్యేకంగా చెప్పింది. ఆల్రెడీ డిసైడైన బ్యాచే ఉంటుంది. ఎప్పుడో తెలుసు. హరిక్రిష్ణ చనిపోయినప్పుడు ఆయన చేసిన ఓ రకమైన హడావుడి కూడా తెలుసు. ఇప్పుడు వైసీపీలో చేరడం కొత్త కాదు కానీ చేర్చుకుంటున్న టైమ్ మాత్రం ప్రత్యేకం. రోజుకో లీడర్ వస్తున్నాడు అని కలర్ ఇవ్వడం ఇక్కడ పాయింట్. టీడీపీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే !

-->