ధర్మానకు పిడి దిగింది ! ఆమెతో కొట్టించాడు జగన్ !

జగన్ అంటేనే నమ్మకం – నమ్మకం అంటేనే జగన్ అన్న నాయకుడు నాకేశాడు నేల. సీనియారిటీని కబోర్డ్ లో పెట్టి, ఆత్మాభిమానాన్ని కమోడ్ లో కొట్టి ధర్మాన చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ జగన్ మాత్రం చేయాల్సిందే చేశాడు. ఆమెకు ఓకే చెప్పేశాడు. ఆమెతోనే కొట్టేశాడు ధర్మానకు మేకు !

అవును. సికాకుళంలో సినిమా మారుతోంది. కిల్లి వచ్చిన తర్వాత ధర్మానను గిల్లి వదిలేయడం ఖాయంగా కనిపిస్తోంది. గిల్లేది వైసీపీనే ! కృపారాణి రాకుండా ధర్మాన చేయని ప్రయత్నం అంటూ లేదు. చూశాడు. ఆపాడు. అడ్డు పుల్ల వేశాడు. కంప్లైంట్లు చేయించాడు. బెదిరించాడు. నేను వెళ్లిపోతా అని కూడా చెప్పాడు. అయినా సరే ఆమెను తీసుకుంటున్నాడు జగన్. రేపే ముహూర్తం. ఇక టెక్కలిలో సినిమా మారిపోయిట్టే ! ఎందుకంటే ఆమె అక్కడ అసెంబ్లీ బరిలో దిగుతా అంటోంది. అక్కడ ధర్మాన ఆబ్లిగేషన్ ఉంది ఇవాల్టి వరకూ. ఇప్పుడు అది డస్ట్ బిన్ లో పడినట్టే ! అంటే పోతే పో అని పరోక్షంగా చెప్పడమే . పౌరుషం ఉంటే ఇక తప్పుకోవడమే మిగిలింది. అదే ఉంటే నీకాడ ఎందుకు ఉంటా మహరాజా అని సాగిలపడితే చేసేది ఏం లేదు. ధర్మాన సినిమా ఇప్పుడు అదేనేమో ! కేసుల్లో ఇరుక్కొని, రాజకీయ జీవితాన్ని అడ్డంగా నరుక్కొని జగన్ ను నమ్ముకొని ఆరేళ్లుగా ముక్కు మూసుకొని నెట్టుకొచ్చాడు ధర్మాన. కానీ జగన్ మాత్రం అవేం పట్టించుకోలేదు. చేయాల్సిందే చేసుకుంటూ పోతున్నాడు. కనీసం మాట వరసకి అయినా చెప్పలేదు. ఏదో కాస్త గౌరవం ఇచ్చాడు అనుకునేవాణ్ని. అది కూడా లేకుండా చేశాడు ఇప్పుడు అంటూ భోరుమంటున్నాడు ధర్మాన.

ఇదే మాట ఎవరితో అయినా అంటే అన్నాడు. అదే మాట కనుక ఒకవేళ బొత్సతో అంటే మాత్రం సీన్ మరోలా ఉంటుంది. నాతో చెబితే నేను మరి ఎవరితో చెప్పుకోను ప్రసాదా అంటూ భోరుమంటాడేమో ! లోటస్ పాండ్ ఓ సైడు ప్రాంతం అంతా అప్పుడు ఏడుపుల పాయగా మారిపోగలదు !

-->