రాత్రి 11 తర్వాత చంద్రబాబు ఏం చేస్తున్నాడో తెలుసా ? ఇది కొత్త టార్గెట్ !

క్రిష్ణా జిల్లా వాళ్లకి ఉలవచారు గురించి, గోదావరి జిల్లాలోళ్లకి పూత రేకుల గురించి, తెలుగు రాష్ట్రాలకి చంద్రబాబు పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉదయం మొదలై అర్థరాత్రి ఎండ్ అయ్యే షెడ్యూల్ అందరికీ తెలుసు కానీ, రాత్రి 11 తర్వాత ప్రత్యేకంగా పెట్టుకున్న టాస్క్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. చూడండి. ఇది ఎక్స్ ట్రా డ్యూటీ ! ఇంతకీ 11 తర్వాత ఏం చేస్తున్నాడు ? నాయకుడే వ్యూహాత్మక సైనికుడు అయ్యే సమయం ఇది !

ఉదయం నుంచి ఆయన జనం కోసం ఉంటాడు. ఇంటికి ఏ పది గంటలకో తిరిగి వచ్చాక కూడా ఆయన కోసం జనం ఉంటారు. వాళ్లలో అలుపూ సొలుపూ లేకుండా మాట్లాడతాడు. అందరినీ పంపేసి, ఆఖరికి వ్యక్తిగత సహాయకుల్ని కూడా వద్దనుకొని ఒంటరిగా ఆయన తన గది వైపు వెళ్లిపోతున్నప్పుడు రేపు మళ్లీ వస్తా అని పొద్దు దిగుతున్న సూరీడు గుర్తొస్తాడు. అప్పటికే అర్థరాత్రి అవుతుంది. అప్పటికీ ఆయన నిద్రకి ఉపక్రమించే సమయం కేవలం ఐదు గంటలు. ఇప్పుడు అందులో కూడా కొంత కోత పడింది. 11 తర్వాత కొత్త పనులు పెట్టుకున్నాడు. అంటే రోజు వారీ షెడ్యూల్ కాస్త కుదించి, తమ వ్యక్తిగత సమయాన్ని కలిపి కొత్త టాస్క్ పెట్టుకున్నాడు. అవును. తెలంగాణ ఎన్నికలే ! జిల్లాల వారీగా అప్ డేట్లు, మారుతున్న పల్స్, వేయాల్సిన ఎత్తుగడలు, ప్రత్యర్థుల వ్యూహాలు అన్నీ అప్పుడే పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నాడు. ఇవాళ ఏం జరిగిందో లెక్క తీసి, రేపు ఏం చేయాలో నిర్దేశిస్తూ, అవసరమైతే కాంగ్రెస్ కి సలహాలిచ్చేలా సాగుతోంది ఆయన వ్యూహరచన. ఏమాటికి ఆ మాటే చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ నియోజక వర్గం, అక్కడి పరిస్థితులు, నేతలు, బలాబలాలు తెలిసిన ఏకైక నాయకుడు చంద్రబాబు. అవును. నిజం ఇది. ఒకప్పుడు ఇద్దరు ఉండేవారు. ఒకాయన రాలిపోయాడు. కనీసం కేసీఆర్ కూడా తెలీదు 119 నియోజక వర్గాలూ పూర్తి స్థాయిలో ! ఆ మాటకొస్తే ఆయన పార్టీ తరపున గత ఎన్నికల్లో గెలిచిన 60 మందిలో దాదాపు సగం మంది ఈ నిమిషానికి ఆయన్ని నేరుగా కలవలేదు. వాస్తవాలు ఇలాగే ఉంటాయ్ !

ఎన్నికలు ఉన్నాయ్, తెలంగాణను గెలవాల్సిన అవసరం ఉంది కదా అని సొంత పని తగ్గించుకోలేదు. ఏపీ కోసం కేటాయించే సమయాన్ని కుదించలేదు. ఏ పనీ ఎక్కడా ఆప లేదు. కేవలం తన వ్యక్తిగత సమయాన్ని ఖర్చు పెడుతున్నాడు. చంద్రబాబు అంటే ఇదే అనిపిస్తుంది ఇలాంటివి తెలిసనప్పుడే ! బహుశా మరో మూడు వారాలు ఇంతే !

-->