దొరికిపోయాడు మోడీ – రాఫెల్ వివరాలు అడిగింది సుప్రీం !

గొగోయ్ సుప్రీంలో సుప్రీం అయితే సీన్ ఎలా ఉంటుందని అయితే దేశం మొత్తం ఊహించిందో కచ్చితంగా అలాగే ఉందిప్పుడు ! రాఫెల్ డీల్ లో ఏం జరిగిందో తెలియాలి అంటూ సుప్రీం పట్టుబిగించింది. వివరాలు అన్నీ సీక్రెట్ చెప్పలేం అని కేంద్రం వాదించినా సుప్రీం కుదరదని తేల్చేసింది. అంటే మోడీ దొరికిపోయినట్టేనా ?

అసలే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎదురీదుతోంది. రాఫెల్ ఆరోపణలతో మోడీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. విదేశాల్లో తిరుగుతున్నాడు తప్పితే స్వదేశంలో నేరే తెరవడం లేదు. మాటల మీద ఆధారపడి బతికిన మోడీ ఇప్పుడు నోరు తెరవలేని పరిస్థితి. ఇంకో పక్కన దేశం మొత్తం తిరుగుతూ రాఫెల్ సంగతి బైట పెడుతున్నాడు రాహుల్ గాంధీ. ఇరకాటం నుంచి ఎలా బైట పడాలో తెలియక అల్లాడిపోతున్న టైమ్ లో ఇప్పుడు సుప్రీం ఎంటర్ అయ్యింది. అసలు రాఫెల్ ప్పైసింగ్ ఏంటో, వివరాలు ఏంటో పది రోజుల్లో రిపోర్ట్ ఇవ్వండని ఆదేశించింది. కేంద్రం ఎప్పటిలాగే మెలిక పెట్టింది. రాఫెల్ డీల్ అంతా దేశ రక్షణ రహస్యం అని బైటకి చెప్పకూడదని వాదించారు అటార్నీ జనరల్. అలాంటివేం కుదరవని తేల్చేసింది సుప్రీం. ఇప్పటికే రహస్యం ఏం లేదు ఇందులో అని ఫ్రాన్స్ తేల్చేశాక మోడీ పాత పాటే పాడుతున్నాడు.

ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతోంది మోడీ బండారం బైటపడబోతోంది. అనిల్ అంబానీ కోసం ఫ్రాన్స్ మీద మోడీ ఎలా ఒత్తిడి తెచ్చాడు ? ధర ఎలా అమాంతం పెరిగింది ? హిందూస్థాన్ ఏరో నాటిక్స్ ను కాదని అంబానీకి ఎందుకు ఇచ్చారు ? అన్నీ బైటపడతాయ్ ! అది కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ! మోడీ మటాష్ అయిపోడానికి, రాజకీయంగా తుడిచి పెట్టుకుపోవడానికి ఈ మాత్రం వివరాలు చాలు.

-->