టీడీపీ అధినేతకు మోకరిల్లింది కాంగ్రెస్ ఇది చంద్రబాబు తడాఖా !

నవంబర్ 1. దేశానికి కొత్త రాజకీయ అవతరణ దినోత్సవం. తెలుగు దేశం అవసరం దేశానికి మరోసారి కనబడుతున్న రోజు. చంద్రబాబు ఢిల్లీ టూర్ రాజకీయాన్ని ఎలా మార్చబోతోంది ? రాహుల్ గాంధీ చంద్రబాబును కలవాలి అని ఎందుకు కోరుకుంటున్నాడు ? ఆహ్వానం పలికి మరీ ఎదురెళ్లి ఎందుకు స్వాగతిస్తానంటున్నాడు ? ఇది ఆంధ్రుడి తడాఖా. చంద్రబాబు చాతుర్యం.

కాంగ్రెస్ అధ్యక్షుడు టీడీపీ అధినేత సాయం కోరిన క్షణం. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఏ ప్రాంతీయ పక్షం సాయం కోరి, ఆ పార్టీ అధ్యక్షుడి రాక కోసం నిరీక్షించి – ఎదురెళ్లి స్వాగతం పలకడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. పొత్తులు ఎత్తుగడలు వ్యూహాలు కాంగ్రెస్ కి కొత్త కాదు. ప్రాంతీయ పార్టీలతో కలవడం, విడిపోవడం, ఆధారపడటం కూడా కాంగ్రెస్ కి అలవాటే. కానీ ఇప్పటి వరకూ జరిగింది వేరు. ఇప్పుడు జరగబోతున్నది వేరు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ కే అవసరం. లేదంటే రెండు వైపులా ఉండేది అవసరం. కానీ తొలిసారి, మనకన్నా కాంగ్రెస్ కే ఎక్కువ అవసరం. మోడీ వ్యతిరేకతను ఏకం చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. కలిసొచ్చేందుకు ప్రాంతీయ పక్షాలు సిద్ధపడటం లేదు. కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సమయంలో నేను కూడా మీ నాయకత్వాన్నే ఒప్పుకుంటున్నా అంటూ రాహుల్ గాంధీ చంద్రబాబుకి ఆహ్వానం పలికిన క్షణం ఇది.

ఓ మాట ఓపెన్ గా చెప్పుకోవాలి. 2014లో మోడీతో టీడీపీ పొత్తు ఓ తప్పని సరి ముచ్చట. కేంద్రం సాయం కావాలి. ఏపీ కష్టాల్లో ఉంది – అని ఆలోచించి చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగు వేశాడు. నమ్మినోడే గొంతు కోయాలని చూశాడు. అన్యాయం చేశాడు మోడీ. ఏపీ ఇప్పుడు రగిలిపోతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను ఏకం చేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ చంద్రబాబు సాయం కోరుతోంది. అంటే ఇది దాదాపుగా 1999 నాటి పరిస్థితి. వాజ్ పేయి, అద్వానీ బాబు సాయం తీసుకున్నప్పుడు తిరిగినట్టుగా ఇప్పుడు మరోసారి చక్రం తిరగబోతోంది. చంద్రబాబు ప్రభ వెలగబోతోంది. చివరిగా ఒక్క మాట. వాజ్ పేయి లాంటి శిఖరానికీ రాహుల్ కీ ఎంత తేడా ! అంతే మందంతో చంద్రబాబు వెయిటేజీ కూడా పెరగబోతోంది. ఏపీ పేరు మార్మోగబోతోంది చూస్తుండండి.

-->