టాప్ త్రీలో గుంటూరు ! ఇదీ పవర్ ఆఫ్ చంద్రబాబు !

గుంటూరోళ్ల కాలర్ ఇప్పుడు మెడ మీద నిలవడం లేదు. పైకెగురుతోంది ! ఎదరకెళితే బెజవాడే అంటూ డిపెండ్ అయిన రోజులు పోయాయ్ అని కళ్లెగెరేసి మరీ చెబుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు రాకతో గుంటూరు మారింది. రాత మారింది. ఫ్యూచర్ మారింది. గుంటూరు ఏకంగా టాప్ త్రీలోకి ఎగబాకింది. అందుకే ఇప్పుడు గుంటూరు గురించి ఏపీనే కాదు ఇండియా మొత్తం మాట్లాడుతోంది !

థర్డ్ గేర్ లో 40 మీద తిరిగితే సరిగ్గా ఐదు నిమిషాల్లో ఆ చివరి నుంచి ఈ చివరకి వచ్చేస్తది గుంటూరు ! గుప్పెడంత ఊరు. పెద్ద పల్లెటూరు. అలాంటిది టాప్ త్రీ ఎంప్లాయిమెంట్ జనరేషన్ సిటీల్లో ఒకటి అయిపోయింది ! ఎలా ? ఆశ్చర్యం ! విశాఖ లాంటి పెద్ద నగరం కూడా టాప్ 8లో ఉంది. గుంటూరు మాత్రం ముందుకొచ్చింది. మూడులోకి వచ్చింది. ఏం మారింది ఇంతలోనే ? ఏపీకే కాదు ఇండియాకే ఓ మోడల్ చూపించాడు చంద్రబాబు. అవును. గుంటూరోళ్లు కాలర్ ఎగరేసి దిలాసాగా చెప్పొచ్చు – భరోసాగా ఉండొచ్చు మాది గుంటూరు అని ! స్కిల్స్ డెవలప్ మెంట్ ఇండెక్స్ వాళ్లు దేశవ్యాప్తంగా సర్వే చేశారు. ఓ 8 లక్షల మంది యువతను కాంటాక్ట్ చేసి ఆరా తీశారు. ఏం చదివారు ? ఎక్కడ చదివారు ? ఎలాంటి ఉద్యోగం కోరుకున్నారు ? ఏం చేస్తున్నారు ? అని మాత్రమే కాదు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత ? ఇంగ్లిష్ ఏ మాత్రం వచ్చు అనేది కూడా ఆరా తీశారు. తీస్తే గుంటూరు టాప్ త్రీలో ఉంది. అవును. మహా మహా నగరాల్ని గుంటూరు వెనక్కి నెట్టింది. ఏపీ ఉద్యోగ జనరేషన్ లో టాప్ లో ఉంది. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ఏపీ టాప్ పొజిషన్ లో ఉంది. ఉంటుంది. గత ఏడాది ఇంతే. ఇప్పుడు ఇంతే. వచ్చే ఏడాది కూడా ఇంతే ! తెలంగాణ మాత్రం గత ఏడాది, ఇప్పుడు అస్సలు సోదిలో కూడా లేదు. హైద్రాబాద్ నగరం కూడా వెనకబడింది. మోడీ ఊదిన గాలి బుడగ గుజరాత్ కూడా ఎక్కడో ఉంది. టాప్ 10లో లేదు. అంటే వాళ్లు చెబుతున్న కబుర్లు, అభివృద్ధి అన్నీ అబద్ధం అని తేలిపోయింది. రుజువు అయిపోయింది.

మరి గుంటూరు ఎలా టాప్ లోకి వచ్చింది ? ఇదే పాయింట్. ఇదే అసలు ఇప్పుడు మాట్లాడుతున్నది. చంద్రబాబు ఉన్న చోట ఇండస్ట్రీ ఉంటుంది. ఫైనాన్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇన్ ప్రా డెవలప్ అవుతుంది.అన్నిటికీ మించి లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయ్. లేకపోతే జాగ్వర్ లు, బీఎండబ్ల్యూలూ, బ్రాండెడ్ షోరూమ్ లూ గుంటూరులో ఎక్కడి నుంచి వస్తాయ్ ? అవన్నీ రావడం వల్లే గుంటూరు అమాంతం పెరుగుతోంది. పెరగడమే కాదు ఫ్యూచర్ కి డెస్టినేషన్ అవుతోంది. ఇంకా అమరావతి రెక్కలు విదిలించే స్థాయికి రానేలేదు. అమరావతి వేరు. గుంటూరు వేరు. మరి రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న నగరమే ఇలా ఉంటే మరి కేపిటల్ ఏ స్థాయిలో ఉంటుంది ? అర్థం అయిపోతుంది ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచిస్తే. ఇది పవర్ ఆప్ చంద్రబాబు. ఇది విజన్ ఆఫ్ చంద్రబాబు !

-->